వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన రెజ్లర్?
Sakshi Education
వందేళ్లకంటే ఎక్కువ చరిత్ర కలిగిన పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో ఎవరికీ సాధ్యంకాని రికార్డును క్యూబా మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నునెజ్ సాధించాడు.
వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణ పతకాలు గెలిచిన తొలి రెజ్లర్‌గా అతను గుర్తింపు పొందాడు. టోక్యో ఒలింపిక్స్–2020లో గ్రీకో రోమన్ 130 కేజీల విభాగంలో బరిలోకి దిగిన 38 ఏళ్ల లోపెజ్ ఆగస్టు 2న జరిగిన ఫైనల్లో 5–0తో లకోబి కజాయ (జార్జియా)ను ఓడించి విజేతగా నిలిచి స్వర్ణం కైవసం చేసుకున్నాడు.
మహిళల 100 మీ. హర్డిల్స్‌లో జాస్మిన్‌కు స్వర్ణం
టోక్యో ఒలింపిక్స్–2020 భాగంగా నిర్వహించిన మహిళల 100 మీటర్ల హర్డిల్స్ పోటీల్లో ప్యూర్టోరికో అథ్లెట్ జాస్మిన్ కమాచో క్విన్ విజేతగా నిలిచింది. 24 ఏళ్ల జాస్మిన్ 12.37 సెకన్లలో గమ్యానికి చేరి స్వర్ణ పతకాన్ని దక్కించుకుంది. కెండ్రా హ్యారీసన్ (అమెరికా –12.52 సెకన్లు) రజతం... మేగన్ టేపర్ (జమైకా–12.55 సెకన్లు) కాంస్యం గెల్చుకున్నారు. అమెరికాలో పుట్టి అమెరికాలోనే నివసిస్తున్న జాస్మిన్ కరీబియన్ దీవుల్లోని దేశమైన ప్యూర్టోరికోకు ప్రాతినిధ్యం వహించే అవకాశం ఆమె తల్లి కారణంగా లభించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా నాలుగు ఒలింపిక్స్ క్రీడల్లో స్వర్ణాలు నెగ్గిన రెజ్లర్?
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : క్యూబా మల్లయోధుడు మిజైన్ లోపెజ్ నునెజ్
ఎక్కడ : టోక్యో, జపాన్
ఎందుకు : టోక్యో ఒలింపిక్స్–2020 పురుషుల ఒలింపిక్స్ రెజ్లింగ్ క్రీడలో (గ్రీకో రోమన్ 130 కేజీల విభాగం) విజేతగా నిలిచినందుకు...

Published date : 04 Aug 2021 01:06PM