వరుసగా 16 చాంపియన్స్ లీగ్ సీజన్లలో గోల్ చేసిన తొలి ప్లేయర్?
Sakshi Education
ప్రతిష్టాత్మక చాంపియన్స్ లీగ్ ఫుట్‌బాల్ టోర్నీలో బార్సిలోనా స్టార్ ప్లేయర్ లయెనల్ మెస్సీ ఖాతాలో అరుదైన ఘనత చేరింది.
వరుసగా 16 చాంపియన్స్ లీగ్ సీజన్లలో గోల్ చేసిన తొలి ప్లేయర్‌గా మెస్సీ చరిత్ర సృష్టించాడు. స్పెయిన్‌లోని బార్సిలోనాలో అక్టోబర్ 21న ఫెరాస్కారోస్‌తో జరిగిన మ్యాచ్‌లో 27వ నిమిషంలో అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచిన మెస్సీ ఈ అరుదైన రికార్డును అందుకున్నాడు. మాంచెస్టర్ యునెటైడ్ మాజీ వింగర్ ర్యాన్ గిగస్ కూడా 16 సీజన్లలో గోల్ చేసినప్పటికీ... వరుస సీజన్లలో గోల్ చేసిన ఆటగాడు మాత్రం మెస్సీనే.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా 16 చాంపియన్స్ లీగ్ సీజన్లలో గోల్ చేసిన తొలి ప్లేయర్
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : లయెనల్ మెస్సీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా 16 చాంపియన్స్ లీగ్ సీజన్లలో గోల్ చేసిన తొలి ప్లేయర్
ఎప్పుడు : అక్టోబర్ 21
ఎవరు : లయెనల్ మెస్సీ
Published date : 22 Oct 2020 06:02PM