Skip to main content

వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నమెంట్ నిబంధనల్లో కీలక మార్పులు

ప్రతిష్టాత్మక ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ టోర్నమెంట్ నిబంధనల్లో ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) కీలక మార్పులు చేసింది.
Edu newsగతంలో ‘ప్రపంచ చాంపియన్‌‌స’ హోదాలో ర్యాంకింగ్స్‌తో నిమిత్తం లేకుండా ఆటగాళ్లు నేరుగా ఈ టోర్నీలో పాల్గొనేవారు. ఇప్పుడు ఈ అవకాశాన్ని ఎత్తివేసిన బీడబ్ల్యూఎఫ్ ఇతర వరల్డ్ టూర్ టోర్నీల్లో సాధించిన పారుుంట్ల ప్రకారమే అత్యుత్తమ ఆటగాళ్లను ఎంపిక చేస్తామని అక్టోబర్ 12న ప్రకటించింది.

కొత్త నిబంధనల ప్రకారమే బ్యాంకాక్‌లో జరుగనున్న ఫైనల్స్ టోర్నీకి అర్హులైన ఆటగాళ్లను అనుమతిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. థాయ్‌లాండ్‌లోని బ్యాంకాక్ వేదికగా 2021, జనవరి 27-31 మధ్య ‘ఫైనల్స్’ టోర్నీ జరుగుతుంది. మహిళల విభాగంలో ప్రపంచ చాంపియన్ అయిన పీవీ సింధు ఇక ఆ హోదాతో టోర్నీలో పాల్గొనే అవకాశం లేదు.
Published date : 13 Oct 2020 07:20PM

Photo Stories