Skip to main content

వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఏపీ మంత్రులు

దేశ రాజధాని న్యూఢిల్లీలో రెండు రోజులపాటు నిర్వహిస్తున్న ప్రపంచ ఆర్థిక సమాఖ్య(వరల్డ్ ఎకనమిక్ ఫోరం) సదస్సులో అక్టోబర్ 3న ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఆంధ్రప్రదేశ్ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మేకపాటి మాట్లాడుతూ... ఏపీ ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ పెంచడమే తక్షణ కర్తవ్యంగా ముందుకెళ్తున్నామని వెల్లడించారు. ఇందుకోసం బ్రాండ్‌థాన్ పేరుతో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని.. ప్రపంచ వ్యాప్తంగా పెట్టుబడులను ఆకర్షించే విధంగా సరికొత్త ఆలోచనలు, సలహాలను స్వీకరించాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో 31 ఎంఎస్‌ఎంఈ క్లస్టర్ల ఏర్పాటుతో పాటు 13 జిల్లాలను ఇండస్ట్రియల్ జోన్లుగా మార్చడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వరల్డ్ ఎకనమిక్ ఫోరంలో ఏపీ మంత్రులు
ఎప్పుడు : అక్టోబర్ 3
ఎవరు : ఏపీ పరిశ్రమలు, వాణిజ్య, ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి, ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 04 Oct 2019 05:35PM

Photo Stories