Skip to main content

వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌: ప్రధాని మోదీ

కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కొనడానికి ‘ఒకే భూమి, ఒకే ఆరోగ్యం (వన్‌ ఎర్త్‌.. వన్‌ హెల్త్‌)’ అనే సమష్టి భావనతో ప్రపంచం ముందుకు సాగాలని భారత ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు.
Current Affairs జీ7 సదస్సులో ‘‘బిల్డింగ్‌ బ్యాక్‌ స్ట్రాంగర్‌ హెల్త్‌’’ పేరిట నిర్వహించిన చర్చాగోష్టిలో జూన్‌ 12న మోదీ ఆన్‌లైన్‌ ద్వారా పాల్గొన్నారు. వ్యాక్సిన్లపై తాత్కాలికంగా మేధో హక్కులను (పేటెంట్లను) రద్దు చేయాలని ప్రపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటీఓ)లో భారత్, దక్షిణాఫ్రికాలు ఉమ్మడిగా చేసిన ప్రతిపాదనకు మద్దతుగా నిలవాలని మోదీ జీ7 దేశాధినేతలను కోరారు.

జీ7లో యూకే, అమెరికా, కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్‌లు సభ్యదేశాలుగా ఉన్నాయి. 2021 జీ7 వార్షిక సదస్సులో భారత్, దక్షిణాఫ్రికా, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియాలు ప్రత్యేక ఆహ్వానితులుగా పాల్గొంటున్నాయి.
Published date : 15 Jun 2021 08:13PM

Photo Stories