Skip to main content

వివాద్ సే విశ్వాస్ పథకం పరిధి విస్తరణ

ప్రత్యక్ష పన్ను వివాదాల పరిష్కారానికి ఉద్దేశించిన ‘వివాద్ సే విశ్వాస్’ పథకం పరిధిని విస్తరించాలని కేంద్రప్రభుత్వం నిర్ణయించింది.
Current Affairsఈ మేరకు ‘వివాద్ సే విశ్వాస్ సవరణ బిల్లు’కు కేంద్ర కేబినెట్ ఫిబ్రవరి 12న ఆమోదం తెలిపింది. తాజా బిల్లు ప్రకారం రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు కూడా వివాద్ సే విశ్వాస్ పథకంలోకి వస్తాయి. అలాగే పథకాన్ని ఎంచుకున్న వారు.. మార్చి 31లోగా వివాదాస్పద పన్ను మొత్తం కడితే వడ్డీ నుంచి పూర్తి మినహాయింపు లభిస్తుంది. 2019 నవంబర్ దాకా గణాంకాల ప్రకారం.. వివాదాల్లో చిక్కుబడిన ప్రత్యక్ష పన్ను బకాయీలు సుమారు రూ. 9.32 లక్షల కోట్లుగా ఉన్నాయి.

మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లుకి ఆమోదం
12 ప్రధాన పోర్టులకు స్వయంప్రతిపత్తినిచ్చే దిశగా 1963 నాటి చట్టం స్థానంలో కొత్త చట్టం తెచ్చేందుకు ఉద్దేశించిన ‘మేజర్ పోర్ట్ అథారిటీ బిల్లు-2020’కి కేంద్ర కేబినెట్ ఆమోదముద్ర వేసింది. ప్రధాన పోర్టుల సామర్థ్యాన్ని, పోటీతత్వాన్ని పెంచేందుకు ఈ బిల్లు తోడ్పడనుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వివాద్ సే విశ్వాస్ పథకం పరిధి విస్తరణ
ఎప్పుడు : ఫిబ్రవరి 12
ఎవరు : కేంద్ర కేబినెట్
ఎందుకు : రుణ రికవరీ ట్రిబ్యునల్స్‌లో (డీఆర్‌టీ) ఉన్న పెండింగ్ కేసులు కూడా వివాద్ సే విశ్వాస్ పథకంలోకి తెచ్చేందుకు
Published date : 13 Feb 2020 05:48PM

Photo Stories