విషపూరిత అణు జలాలను ఏ సముద్రంలోకి వదిలేయాలని జపాన్ నిర్ణయించింది?
Sakshi Education
2011లో సంభవించిన సునామీ, భూకంపం తాకిడికి తీవ్రంగా దెబ్బతిన్న ఫుకుషిమా అణు రియాక్టర్‌లోని విషపూరిత అణు జలాలను పసిఫిక్ సముద్రంలోకి వదిలేయాలని జపాన్ ప్రభుత్వం నిర్ణయించింది.
స్థానికులు, మత్స్య కారులు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేస్తుండగా ఇంతకంటే ఆచరణాత్మక పరిష్కారం మరోటి లేదని ప్రభుత్వం అంటోంది. రెండేళ్లలో నీటి విడుదలను ప్రారంభించి అది పూర్తయ్యాక, అణు ప్లాంట్‌ను దశలవారీగా మూసివేస్తామని పేర్కొంది. ఈ ప్రక్రియకు కనీసం 30 ఏళ్లు పడుతుందని అంచనా.
అణు రియాక్టర్‌ను చల్లబరిచేందుకు వినియోగించిన సుమారు 1.25 మిలియన్ టన్నుల నీరు అణు పదార్థాలతో కలుషితమై ప్రమాదకరంగా మారింది. 2011 నుంచి 1,020 ట్యాంకుల్లో నిల్వ ఉండటంతో లీకేజీ అవుతోంది. వచ్చే ఏడాది చివరికల్లా రియాక్టర్‌లోని ట్యాంకులన్నీ నిండిపోతాయని టోక్యో ఎలక్ట్రిక్ పవర్ కంపెనీ తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫుకుషిమా అణు రియాక్టర్‌లోని విషపూరిత అణు జలాలను పసిఫిక్ సముద్రంలోకి వదిలేయాలని నిర్ణయం
ఎప్పుడు : ఏప్రిల్ 13
ఎవరు : జపాన్ ప్రభుత్వం
ఎందుకు : ఇంతకంటే ఆచరణాత్మక పరిష్కారం మరోటి లేదని

Published date : 15 Apr 2021 05:59PM