విశాఖ నావల్ డాక్‌యార్డ్‌లో ఎంవోఎం ఆవిష్కరణ
Sakshi Education
కోవిడ్-19 (కరోనా వైరస్) విజృంభిస్తున్న నేపథ్యంలో అత్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించే వినూత్నమైన పరికరాన్ని విశాఖ నావల్ డాక్‌యార్డ్ అభివృద్ధి చేసింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మల్టీఫీడ్ ఆక్సిజన్ మెనిఫోల్డ్ (ఎంవోఎం) పేరుతో నూతన పరికరం ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : విశాఖ నావల్ డాక్యార్డ్ఎందుకు : త్యవసర పరిస్థితుల్లో ఒకే ఆక్సిజన్ సిలిండర్ నుంచి ఆరుగురికి ఆక్సిజన్ అందించేందుకు
మల్టీఫీడ్ ఆక్సిజన్ మెనిఫోల్డ్ (ఎంవోఎం) పేరిట ఈ పరికరాన్ని ఆవిష్కరించింది. సాధారణంగా ఆస్పత్రుల్లో ప్రతీ బెడ్‌కు పైప్ ద్వారా ఆక్సిజన్ అందించే సదుపాయం ఉంటుంది. కానీ ప్రస్తుత అత్యవసర పరిస్థితుల్లో కాలేజీలు, హోటల్స్, కళ్యాణ మండపాలు వంటి చోట్ల ఏర్పాటు చేసే ఆస్పత్రుల్లో ప్రతీ రోగికీ ఒక ఆక్సిజన్ సిలిండర్ ఏర్పాటు చేయడం కష్టంతో కూడిన పని. దీన్ని దృష్టిలో పెట్టుకుని నావల్ డాక్‌యార్డ్ సిబ్బంది ఈ ఎంవోఎం పరికరాన్ని అభివృద్ధి చేశారు. సుమారు 25 ఎంవోఎం పరికరాలు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఉచితంగా అందచేయాలని నేవీ నిర్ణయించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మల్టీఫీడ్ ఆక్సిజన్ మెనిఫోల్డ్ (ఎంవోఎం) పేరుతో నూతన పరికరం ఆవిష్కరణ
ఎప్పుడు : ఏప్రిల్ 1
ఎవరు : విశాఖ నావల్ డాక్‌యార్డ్
Published date : 02 Apr 2020 02:10PM