విరాళాల్లో హెచ్‌సీఎల్ నాడార్‌కు అగ్రస్థానం
Sakshi Education
సామాజిక సేవా కార్యక్రమాల కోసం అత్యధికంగా విరాళమిచ్చిన దేశీ దిగ్గజాల్లో టెక్నాలజీ సంస్థ హెచ్‌సీఎల్ అధిపతి శివ్ నాడార్ అగ్రస్థానంలో నిలిచారు.
మరో టెక్ దిగ్గజం విప్రో వ్యవస్థాపకుడు అజీం ప్రేమ్‌జీ రెండో స్థానంలో ఉండగా.. దేశంలోనే అత్యంత సంపన్నుడైన రిలయన్‌స ఇండస్ట్రీస్ అధినేత ముకేశ్ అంబానీ మూడో స్థానంలో నిలిచారు. ఎడెల్‌గివ్ హురూన్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్-2019 నివేదికలో ఈ అంశాలు వెల్లడయ్యాయి.
ఈ ఫిలాంత్రోపీ లిస్ట్ ప్రకారం నాడార్, ఆయన కుటుంబం మొత్తం రూ. 826 కోట్లు విరాళమివ్వగా, ప్రేమ్‌జీ రూ. 453 కోట్లు, అంబానీ రూ. 402 కోట్లు విరాళమిచ్చారు. 2018తో పోలిస్తే 2019 ఏడాది దాతృత్వ విరాళాలు రెట్టింపై రూ. 4,391 కోట్లకు చేరుకున్నాయి. వ్యక్తిగతంగా, కార్పొరేట్ సామాజిక బాధ్యత (సీఎస్‌ఆర్) కింద ఏడాదిలో రూ.5 కోట్లకు మించి విరాళంగా ఇచ్చిన 100 మందితో ఫిలాంత్రోపీ లిస్ట్-2019ను రూపొందించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విరాళాల్లో హెచ్‌సీఎల్ నాడార్‌కు అగ్రస్థానం
ఎప్పుడు : అక్టోబర్ 14
ఎవరు : ఎడెల్‌గివ్-హురూన్ ఇండియా ఫిలాంత్రోపీ లిస్ట్ 2019
ఎక్కడ : భారత్

Published date : 15 Oct 2019 06:39PM