Skip to main content

వినూత్న మరుగుదొడ్లకు పురస్కారాలు

వినూత్నంగా మరుగుదొడ్డిని ఏర్పాటు చేసుకున్న నెల్లూరు జిల్లా జువ్వలదిన్నెకు చెందిన కోడూరు గోవిందమ్మను స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం వరించింది.
ఢిల్లీలో జూన్ 24న జరిగిన కార్యక్రమంలో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా గోవిందమ్మ తరఫున నెల్లూరు స్వచ్ఛ భారత్ మిషన్ కన్సల్టెంట్ వై.మహేష్ ఈ అవార్డు అందుకున్నారు. మరుగుదొడ్ల వినియోగం, ఆకర్షణీయమైన రీతిలో వాటి నిర్మాణం, పరిశుభ్రత వంటి అంశాలను పరిగణలోకి తీసుకొని కేంద్ర జల శక్తి మంత్రిత్వ శాఖ పలు రాష్ట్రాలు, జిల్లాలు, సంస్థలు, వ్యక్తిగత విభాగంకు అవార్డులు ప్రకటించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
స్వచ్ఛ మహోత్సవ్ పురస్కారం
ఎప్పుడు : జూన్ 24
ఎవరు : కోడూరు గోవిందమ్మ
ఎక్కడ : జువ్వలదిన్నె, నెల్లూరు జిల్లా
ఎందుకు : ఆకర్షణీయమైన రీతిలో మరుగుదొడ్డిని నిర్మించుకున్నందుకు
Published date : 25 Jun 2019 05:58PM

Photo Stories