విమలా శాంతి సాహిత్య అవార్డుకు ఎంపికైన అభ్యుదయ కథారచయిత?
Sakshi Education
ప్రసిద్ధ అభ్యుదయ కథారచయిత ఆచార్య కేతు విశ్వనాథరెడ్డిని విమలాశాంతి జీవిత సాహిత్య సాఫల్య పురస్కారం వరించింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విమలా శాంతి సాహిత్య అవార్డుకు ఎంపికైన అభ్యుదయ కథారచయిత?
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
ఎందుకు : సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకుగాను
ఈ విషయాన్ని అవార్డు వ్యవస్థాపకుడు డా.శాంతినారాయణ ఏప్రిల్ 3న తెలిపారు. ఒక ప్రత్యేక కార్యక్రమంలో రూ.50 వేల నగదు ప్రదానంతోపాటు సన్మాన కార్యక్రమం ఉంటుందని పేర్కొన్నారు. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన తన సతీమణి విమల జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ప్రతి ఏడాది ఒక సీనియర్ కథా, నవలా రచయితకు ఇవ్వాలని నిర్ణయించినట్టు చెప్పారు. ఇందులో భాగంగా తొలి పురస్కారాన్ని విశ్వనాథరెడ్డికి ఇస్తున్నట్లు వివరించారు.
విశ్వనాథ్‌రెడ్డి నేపథ్యం...
విశ్వనాథ్‌రెడ్డి నేపథ్యం...
- కడప జిల్లా రంగశాయిపురానికి చెందిన కేతు విశ్వనాథరెడ్డి జప్తు, ఇచ్ఛాగ్ని, కేతు విశ్వనాథరెడ్డి కథలు వంటి సంపుటాలు వెలువరించారు. బోధి, వేర్లు అనే నవలికలు రాశారు. దృష్టి అనే విమర్శనా వ్యాస సంపుటిని ప్రచురించారు.
- తెలుగు అధ్యాపకులుగా పనిచేసిన ఆయన ‘కడప ఊర్లపేర్లు ‘అనే అంశం మీద పరిశోధించి, తెలుగు పరిశోధనలో కొత్త గవాక్షం తెరిచారు.
- కొడవటిగంటి కుటుంబరావు సాహిత్య సర్వస్వాన్ని ఆరు సంపుటాలుగా సంకలనం చేసి, విలువైన ముందు మాటలు రాశారు.
- కూలినబురుజు, వాన కురుస్తే, అమ్మవారి నవ్వు, నమ్ముకున్న నేల, తేడా వంటి అనేక కథలలో రాయలసీమ జీవిత వాస్తవికతను ప్రతిబింబించారు.
- సీపీ బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రం సలహామండలి సభ్యులుగా ఉన్నారు.
- ఇప్పటికే కేంద్ర సాహిత్య అకాడమీతోపాటు అప్పాజోశ్యుల విష్ణుభొట్ల ఫౌండేషన్ పురస్కారం పొందారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : విమలా శాంతి సాహిత్య అవార్డుకు ఎంపికైన అభ్యుదయ కథారచయిత?
ఎప్పుడు : ఏప్రిల్ 3
ఎవరు : ఆచార్య కేతు విశ్వనాథరెడ్డి
ఎందుకు : సాహిత్య రంగంలో చేసిన విశేష సేవలకుగాను
Published date : 05 Apr 2021 05:56PM