Skip to main content

విమానాశ్రయాల లీజుకు కేబినెట్ ఆమోదం

మరో మూడు విమానాశ్రయాలను ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యం విధానంలో(పీపీపీ) లీజుకు ఇచ్చేందుకు ఆగస్టు 19న కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలియజేసింది.
Current Affairs
ఈ మూడు.. జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాలు కాగా, వీటి నిర్వహణ హక్కులను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ బిడ్‌ రూపంలో 2019 ఏడాది గెలుచుకుంది. ఈ మూడింటితోపాటు లక్నో, అహ్మదాబాద్, మంగళూరు విమానాశ్రయాలను కూడా 2019 ఫిబ్రవరిలో అదానీ దక్కించుకుంది. ఈ ఆరింటిలో అహ్మదాబాద్, మంగళూరు, లక్నో విమానాశ్రయాలను అదానీ ఎంటర్‌ప్రైజెస్‌కు లీజుకు ఇచ్చేందుకు అనుకూలంగా 2019 జూలైలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. మిగిలిన మూడు విమానాశ్రయాలనూ పీపీపీ విధానంలో లీజునకు తాజాగా ఆమోదముద్ర వేసింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి : జైపూర్, తిరువనంతపురం, గువాహటి విమానాశ్రయాల లీజుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 19
ఎవరు : కేంద్ర కేబినెట్‌
Published date : 20 Aug 2020 05:14PM

Photo Stories