విక్రమ్ ల్యాండర్ ధ్వంసం కాలేదు: ఇస్రో
Sakshi Education
చంద్రయాన్-2లో భాగంగా ప్రయోగించిన ‘విక్రమ్’ ల్యాండర్ చంద్రుడి ఉపరితలాన్ని ఢీకొని పక్కకు ఒరిగిపోయిందని భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో తెలిపింది. అయితే ఈ ఘటనలో ల్యాండర్ ధ్వంసం కాలేదని సెప్టెంబర్ 9న వెల్లడించింది.
విక్రమ్‌తో సంబంధాల పునరుద్ధరణకు బెంగళూరులోని టెలిమెట్రీ, ట్రాకింగ్ అండ్ కమాండ్ నెట్వర్క్ కేంద్రంలోని శాస్త్రవేత్తలు తీవ్రంగా కృషి చేస్తున్నారని పేర్కొంది. ఇస్రో జీఎస్ఎల్వీ మార్క్-3 వాహకనౌక ద్వారా జూలై 22న చంద్రయాన్-2ను ప్రయోగించిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 7న తెల్లవారుజామున ఆర్బిటర్ నుంచి విడిపోయిన విక్రమ్ జాబిల్లివైపు పయనమైంది. చంద్రుడికి 2.1 కి.మీ ఎత్తులో విక్రమ్ ఉండగా, కమాండ్ సెంటర్‌తో సంబంధాలు తెగిపోయాయి.
Published date : 10 Sep 2019 08:18PM