Skip to main content

విద్యావారధి వాహనాలు ప్రారంభం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణా సంస్థ (ఎస్‌సీఈఆరీ్ట), రాష్ట్ర విద్యా పరిపాలన శిక్షణా సంస్థ (సీమ్యాట్‌) సంయుక్తంగా రూపకల్పన చేసిన విద్యావారధి వాహనాలు ప్రారంభమయ్యాయి.
Current Affairs సమగ్ర శిక్షా రాష్ట్ర కార్యాలయంలో జూలై 31న జరిగిన కార్యక్రమంలో విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌ ఈ వాహనాలను ప్రారంభించారు. కోవిడ్‌-19 నేపథ్యంలో విద్యాసంస్థలు తెరవలేని పరిస్థితి ఉన్నందున విద్యా సంవత్సరాన్ని ముందుకు తీసుకు వెళ్లడంలో భాగంగా ప్రభుత్వం ఆన్ లైన్, డిజిటల్, మొబైల్‌ వాహనాల రూపకల్పన చేసింది. పాఠశాలలు పున:ప్రారంభమయ్యేంతవరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. ఒకటి నుంచి పదో తరగతి వరకు పాఠ్యాంశాలు విద్యావారధి మొబైల్‌ వ్యాను టీవీ తెరల ద్వారా బోధిస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి : విద్యావారధి వాహనాలు ప్రారంభం
ఎప్పుడు : జూలై 31
ఎవరు : విద్యాశాఖామంత్రి డాక్టర్‌ ఆదిమూలపు సురేష్‌
ఎందుకు : టీవీ తెరల ద్వారా పాఠ్యాంశాల బోధనకు
Published date : 02 Aug 2020 10:58AM

Photo Stories