విద్యార్థుల్లో మనోస్థైర్యాన్ని నింపేందుకు కేంద్రం చేపట్టిన కార్యక్రమం పేరు?
Sakshi Education
కోవిడ్ 19 ప్రభావం ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులపై పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కేంద్ర ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది.
విద్యార్థుల్లో మానసిక, శారీరక ఇబ్బందులను తొలగించి మనోస్థైర్యాన్ని నింపేందుకు ‘మనోదర్పణ్’ కార్యక్రమం ద్వారా వయో దశలను అనుసరించి సంరక్షణ చర్యలు చేపట్టనున్నారు. ఇందుకు సంబంధించి అక్టోబర్ 4న ఏపీ సమగ్ర శిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ కె.వెట్రిసెల్వి ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు కొన్ని సూచనలు చేశారు.
వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్ కన్నుమూత
వైఎస్సార్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే, విశాఖ మెట్రో రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (వీఎంఆర్‌డీఏ) మాజీ చైర్మన్ ద్రోణంరాజు శ్రీనివాస్ (59) అక్టోబర్ 4న విశాఖపట్నంలో కన్నుమూశారు. 1961 ఫిబ్రవరి 1న జన్మించిన ఆయన విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. వీఎంఆర్‌డీఏ తొలి చైర్మన్‌గా పనిచేసిన ఆయన ఇటీవల కరోనా వైరస్‌ను జయించారు.

Published date : 06 Oct 2020 12:08PM