Skip to main content

విద్యార్థులకు అత్యంత ఉత్తమ నగరంగా లండన్

విద్యార్థులకు ప్రపంచంలోనే అత్యంత ఉత్తమమైన నగరంగా బ్రిటన్ రాజధాని లండన్ వరుసగా రెండోసారి మొదటి స్థానంలో నిలిచింది.
లండన్ తర్వాత టోక్యో, మెల్‌బోర్న్‌లు వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ మేరకు బ్రిటన్‌కు చెందిన విద్యా ప్రమాణాల సంస్థ క్వాక్‌రెల్లీ సైమండ్‌‌స(క్యూఎస్) విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితా-2019ను జూలై 31న విడుదల చేసింది. ఈ జాబితాలో మొత్తం ప్రపంచంలోని 120 నగరాలకు సంబంధించి ర్యాంకులను ప్రకటించారు.

విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితా-2019లో భారత్ నుంచి బెంగళూరు 81వ ర్యాంకు, తర్వాత ముంబై-85, ఢిల్లీ-113, చెన్నై-115వ స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితా ప్రకారం భారత్ నుంచి లండన్‌కు విద్యనభ్యసించేందుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 2017-18లో ఈ సంఖ్య 20 శాతం పెరిగింది. 2017-18లో మొత్తం 5,455 మంది విద్యార్థులు లండన్‌లో విద్యాసంస్థల్లో చేరగా.. 2016-17లో ఆ సంఖ్య 4,545గా ఉంది.

విద్యార్థులకు ఉత్తమమైన నగరాల జాబితా-2019

ర్యాంకు

నగరం

దేశం

1

లండన్

బ్రిటన్

2

టోక్యో

జపాన్

3

మెల్‌బోర్న్

ఆస్ట్రేలియా

4

మ్యూనిచ్

జర్మనీ

5

బెర్లిన్

జర్మనీ

6

మాంట్రియల్

కెనడా

7

పారిస్

ఫ్రాన్స్

8

జ్యూరిచ్

స్విట్జర్లాండ్

9

సిడ్నీ

ఆస్ట్రేలియా

10

సియోల్

దక్షిణ కొరియా

15

ఎడిన్‌బర్గ్

బ్రిటన్

29

మాంచెస్టర్

బ్రిటన్

81

బెంగళూరు

భారత్

85

ముంబై

భారత్

113

ఢిల్లీ

భారత్

115

చెన్నై

భారత్

ప్రతీ నగరానికి సంబంధించి ప్రధానంగా ఆరు అంశాలను నివేదిక ప్రత్యేకంగా ప్రస్తావించింది. అగ్రశ్రేణి విశ్వవిద్యాలయాలు, జనాభా, జీవన ప్రమాణాలు, డిగ్రీ అనంతరం ఉద్యోగ అవకాశాలు, కొనుగోలు సామర్థ్యాలు, విద్యార్థుల అభిప్రాయాలు వంటి అంశాలు ఆయా నగరాల్లో ఏ మేరకు ఉన్నాయో విశ్లేషించి జాబితా రూపొందించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
విద్యార్థులకు అత్యంత ఉత్తమమైన నగరంగా లండన్
ఎప్పుడు : జూలై 31
ఎవరు : క్వాక్‌రెల్లీ సైమండ్స్(క్యూఎస్)
ఎక్కడ : ప్రపంచంలో
Published date : 01 Aug 2019 06:00PM

Photo Stories