Skip to main content

విదేశీ వ్యవహారాల కార్యదర్శిగా ష్రింగ్లా

భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా హ‌ర్ష్ వర్ధన్‌ ష్రింగ్లా నియమితులయ్యారు.
Current Affairs ఈ మేరకు ప్రధాని నరేంద్ర మోదీ నేతత్వంలోని కేబినెట్‌ నియామక కమిటీ డిసెంబర్‌ 23న ఆయన నియామకానికి ఆమోదం తెలిపింది. ష్రింగ్లా ప్రస్తుతం అమెరికాలో భారత రాయబారిగా ఉన్నారు. 1984 ఐఎఫ్‌ఎస్‌ అధికారుల బ్యాచ్‌కు చెందిన ఆయన 2020, జనవరి 29న నూతన బాధ్యతలు స్వీకరించనున్నారు. ప్రస్తుతం విదేశాంగ కార్యదర్శిగా ఉన్న విజయ్‌ కేశవ్‌ గోఖలే పదవీ కాలం 2020, జనవరి 28న ముగియనుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి :
భారత విదేశీ వ్యవహారాల శాఖ నూతన కార్యదర్శిగా నియామకం
ఎప్పుడు : డిసెంబర్‌ 23
ఎవరు : హార్స్ వర్ధన్‌ ష్రింగ్లా
Published date : 24 Dec 2019 06:00PM

Photo Stories