విదేశీ విద్యార్థుల్లో నేపాలీలే అత్యధికం
Sakshi Education
భారత్‌కు ఉన్నత విద్యనభ్యసించడానికి వచ్చే విదేశీయుల్లో నేపాల్, అఫ్గానిస్తాన్ విద్యార్థులు మొదటి రెండు స్థానాల్లో ఉన్నారని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు 2018-19లో మానవ వనరుల అభివృద్ధి శాఖ చేపట్టిన ఆల్ ఇండియా సర్వే ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వివరాలను సెప్టెంబర్ 24న వెల్లడించింది. ఈ సర్వేలో 962 వర్సిటీలు, 38,179 కళాశాలలు, 9,190 ఇతర సంస్థలు పాల్గొన్నాయి.
ప్రభుత్వం సర్వేలోని అంశాలు
భారత్‌లో ఏ దేశం నుంచి ఎంత మంది విద్యార్థులు (శాతాల్లో)
విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
ప్రభుత్వం సర్వేలోని అంశాలు
- విదేశీయుల్లో అమ్మాయిల కంటే అబ్బాయిలే ఎక్కువమంది భారత్‌కు వస్తున్నారు. అత్యధికులు బీటెక్, ఆ తర్వాత బీబీఏ చదివేందుకు ఆసక్తి చూపుతున్నారు.
- ప్రస్తుతం దేశంలోని వివిధ విద్యా సంస్థల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న 164 దేశాలకు చెందిన 47,427 మంది చదువుకుంటున్నారు. వీరిలో అత్యధిక శాతం కర్ణాటకలో చదివేందుకు ఇష్ట పడుతున్నారు.
- విదేశీ విద్యార్థుల్లో 73.4 శాతం మంది అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులు, 16.15 శాతం మంది పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులు చదువుతున్నారు.
- బీటెక్ చదువుతున్న 8,861 మందిలో 85 శాతం మంది అబ్బాయిలే. ఆ తర్వాత బీబీఏ (3, 354), బీఎస్‌సీ(3,320), బీఏ(2,26)తోపాటు బీఫార్మా, బీసీఏ, ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సులు ఉన్నాయి.
భారత్‌లో ఏ దేశం నుంచి ఎంత మంది విద్యార్థులు (శాతాల్లో)
నేపాల్ | 26.88 |
అఫ్గానిస్తాన్ | 9.8 |
బంగ్లాదేశ్ | 4.38 |
సూడాన్ | 4.02 |
భూటాన్ | 3.82 |
నైజీరియా | 3.4 |
అమెరికా | 3.2 |
యెమెన్ | 3.2 |
శ్రీలంక | 2.64 |
ఇరాన్ | 2.38 |
విదేశీ విద్యార్థులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు
కర్ణాటక | 10,023 |
మహారాష్ట్ర | 5,003 |
పంజాబ్ | 4,533 |
ఉత్తరప్రదేశ్ | 4,514 |
తమిళనాడు | 4,101 |
హరియాణా | 2,872 |
ఢిల్లీ | 2,141 |
గుజరాత్ | 2,068 |
తెలంగాణ | 2,020 |
Published date : 25 Sep 2019 05:50PM