వేతన కోడ్‌కు రాజ్యసభ ఆమోదం
Sakshi Education
దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు వీలు కల్పించే వేతనాల కోడ్ -2019 బిల్లును రాజ్యసభ ఆగస్టు 2న ఆమోదించింది.
సభలో ఈ బిల్లుకు అనుకూలంగా 85 మంది, వ్యతిరేకంగా 8 మంది ఓటేశారు. వేతనాలు, బోనస్‌లకు సంబంధించిన వివిధ నిబంధనలు, సమస్యలకు పరిష్కారం చూపుతూ ప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది.ఈ బిల్లు చట్ట రూపం దాల్చితే దేశ వ్యాప్తంగా ఉన్న 50 కోట్ల మంది కార్మికులకు లాభం కలుగుతుందని కార్మిక మంత్రి సంతోష్ కుమార్ గంగ్వార్ సభలో తెలిపారు.
కనీస వేతనాల చట్టం, వేతన చెల్లింపు చట్టం, బోనస్ చెల్లింపు చట్టం, సమాన ప్రతిఫలం చట్టం స్థానంలో వేతనాల కోడ్ -2019అమల్లోకి రానుంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : కోడ్ -2019 బిల్లుకు ఆమోదం
ఎప్పుడు : ఆగస్టు 2
ఎవరు : రాజ్యసభ
ఎందుకు : దేశ వ్యాప్తంగా వివిధ సంస్థల్లో పనిచేసే ప్రతి కార్మికుడికీ కనీస వేతనం అందించేందుకు

Published date : 03 Aug 2019 05:43PM