Skip to main content

వేలానికి లోకేశ్‌ రాహుల్ ప్రపంచకప్‌ బ్యాట్‌

భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు భారత క్రికెటర్‌ లోకేశ్‌ రాహుల్‌ ముందుకొచ్చాడు.
Current Affairs

పిల్లల చదువు కోసం తనకు సంబంధించిన వస్తువులను వేలం వేయనున్నాడు. ఇందులో 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్‌ ఉంచనున్నట్లు రాహుల్‌ వీడియో మెసేజ్‌ ద్వారా ట్విట్టర్‌లో ప్రకటించాడు. ఈ వేలం ద్వారా సమకూరే మొత్తాన్ని చిన్నారుల సంక్షేమం కోసం కృషిచేస్తోన్న అవేర్‌ ఫౌండేషన్‌కు ఇవ్వనున్నట్లు ఏప్రిల్ 20న తెలిపాడు.


శ్రీలంకలో దక్షిణాఫ్రికా పర్యటన వాయిదా

శ్రీలంకలో దక్షిణాఫ్రికా క్రికెట్‌ జట్టు పర్యటన వాయిదా పడింది. షెడ్యూలు ప్రకారం 2020 జూన్‌లో ఇరు దేశాల మధ్య మూడేసి వన్డేలు, టి20 మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. అయితే కరోనా వైరస్‌ అదుపులోకి రాకపోగా... రోజురోజుకీ మహమ్మారి ఉధృతమవుతోంది. ఈ నేపథ్యంలో సింహళ దేశంలో క్రికెట్‌ సిరీస్‌ను వాయిదా వేస్తున్నట్లు దక్షిణాఫ్రికా బోర్డు వర్గాలు తెలిపాయి.

క్విక్ రివ్యూ :

ఏమిటి : భారత క్రికెటర్‌ లోకేశ్‌ రాహుల్‌ 2019 వన్డే ప్రపంచకప్‌లో తాను ఉపయోగించిన బ్యాట్‌తో పాటు జెర్సీలు, ప్యాడ్స్, గ్లౌజులు, హెల్మెట్స్‌ వేలం
ఎప్పుడు : ఏప్రిల్ 20
ఎందుకు : భారత్‌లో నిరాదరణకు గురైన చిన్నారులకు చేయూతనిచ్చేందుకు
Published date : 21 Apr 2020 06:52PM

Photo Stories