వెద్యరంగంలో ముగ్గురికి నోబెల్
Sakshi Education
వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు వైద్యులకు నోబెల్ బహుమతి లభించింది. ఈ ముగ్గురు వైద్యులలో యూఎస్‌కు చెందిన పరిశోధకులు విలియంకెలిన్, గ్రెగ్ సెమెన్జా, బ్రిటన్‌కు చెందిన పీటర్ రాట్‌క్లిఫ్ ఉన్నారు.
2019 సంవత్సరానికి గానూ వీరికి సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించింది. హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకుగాను ఈ ముగ్గురికి నోబెల్ దక్కింది. ఆక్సిజన్‌ను కణాలు ఏ విధంగా గుర్తించి, స్వీకరిస్తాయన్న అంశంపై వీరు విశేష పరిశోధన సాగించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వెద్యరంగంలో నోబెల్ బహుమతి-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : విలియంకెలిన్, గ్రెగ్ సెమెన్జా, పీటర్ రాట్‌క్లిఫ్
ఎందుకు : హైపోక్సియా పరిశోధనలో విలువైన సమాచారం ఆవిష్కరించినందుకుగాను

Published date : 07 Oct 2019 06:44PM