Skip to main content

వైటథాన్ బ్రాండ్ అంబాసిడర్‌గా లక్ష్మణ్

ఎల్వీ ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో జరగనున్న వైటథాన్ అవగాహన పరుగుకు హైదరాబాద్ క్రికెటర్, సన్‌రైజర్స్ హైదరాబాద్ ఫ్రాంచైజీ మెంటార్ వీవీఎస్ లక్ష్మణ్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించనున్నాడు.
వైటథాన్ అనే వ్యాధి గురించి అవగాహన కల్పించేందుకు ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రి వైటథాన్ పరుగునిర్వహించనుంది. ఏటా నిర్వహించే ప్రపంచ రెటినోబ్లాస్టోమా అవగాహన వారంలో భాగంగా మే 13 నుంచి 19 వరకు హైదరాబాద్‌లో వైటథాన్ పరుగును నిర్విహంచనున్నారు. రెటినోబ్లాస్టోమాగా వ్యవహరించే వైటథాన్ పిల్లల్లో ప్రాణహాని కలిగించే కంటి క్యాన్సర్‌ను కలిగిస్తుంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైటథాన్ బ్రాండ్ అంబాసిడర్ నియామకం
ఎప్పుడు : మార్చి 23
ఎవరు : వీవీఎస్ లక్ష్మణ్
Published date : 25 Mar 2019 05:36PM

Photo Stories