Skip to main content

వైఎస్సార్ రైతు భరోసా పథకం ప్రారంభం

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా సర్వేపల్లి నియోజకవర్గం కాకుటూరులోని విక్రమ సింహపురి విశ్వవిద్యాలయం ప్రాంగణంలో అక్టోబర్ 15న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ‘వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభించారు.
ఈ పథకం ద్వారా రైతులు,కౌలు రైతులకు పంట పెట్టుబడిసాయం కింద ఏటా రూ.13,500 ఇవ్వనున్నారు. ఈ పథకం ద్వారా దాదాపు 54 లక్షల మంది రైతులు లబ్ధిపొందనున్నారు.

రైతుకు ఏటా ఇచ్చే మొత్తం: రూ. 13,500
ఐదేళ్లలో రైతుకిచ్చే సాయం: రూ. 67,500

క్విక్ రివ్యూ:
ఏమిటి:
‘వైఎస్సార్ రైతు భరోసా - పీఎం కిసాన్’ పథకాన్ని ప్రారంభం
ఎవరు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎప్పుడు: అక్టోబర్ 15, 2019
ఎందుకు: రైతులు,కౌలు రైతులకు పంట పెట్టుబడికి ఏటా రూ.13,500 ఆర్థిక సాయం ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
Published date : 16 Oct 2019 05:21PM

Photo Stories