వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం తొలుత ఎక్కడ ప్రారంభమైంది?
Sakshi Education
చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ నేతన్న నేస్తం’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా మూడో ఏడాది అమలు చేసింది.
నేతన్న నేస్తం వరుసగా మూడో ఏడాది సాయం కింద 80,032 మంది నేతన్నలకు రూ.192.08 కోట్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆగస్టు 10న తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్ బటన్ నొక్కి నేరుగా బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. అనంతరం చేనేత కార్మికులనుద్దేశించి సీఎం ప్రసంగిస్తూ... మూడో విడత నేతన్న నేస్తంతో కలిపి చేనేతలకు ఇప్పటివరకు రూ.600 కోట్లు సాయం అందించామని, ఐదేళ్లలో ఒక్క ఈ పథకం ద్వారానే రూ.1,000 కోట్లు అందచేయనున్నట్లు వివరించారు.
ధర్మవరంలో ప్రారంభం...
వైఎస్సార్ నేతన్న నేస్తం పథకాన్ని తొలుత అనంతపురం జిల్లా ధర్మవరంలో 2019, డిసెంబర్ 21న సీఎం వైఎస్ జగన్ ప్రారంభించారు. ఈ పథకం ద్వారా సొంతంగా మగ్గం ఉన్న చేనేత కుటుంబాలకు ఏడాదికి రూ.24 వేల చొప్పున ఆర్థిక సాయం అందిస్తారు. కుటుంబానికి ఎన్ని మగ్గాలున్నప్పటికీ ఒక యూనిట్‌గానే తీసుకుని రూ.24 వేలు అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా మూడో ఏడాది వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం అమలు
ఎప్పుడు : ఆగస్టు 10
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా...
ఎందుకు : చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు...

Published date : 11 Aug 2021 06:10PM