వైఎస్సార్ చేయూత పథకాన్ని తొలుత ఎప్పుడు ప్రారంభించారు?
Sakshi Education
రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్ చేయూత’ పథకాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా రెండో ఏడాది అమలు చేసింది.
జూన్ 22న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి వైఎస్సార్ చేయూత లబ్ధిదారులకు నగదు జమ చేశారు. 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఈ పథకం ద్వారా ఏటా రూ.18,750 చొప్పున నాలుగేళ్లలో మొత్తం రూ.75 వేల ఆర్థిక సాయాన్ని నేరుగా అందించాలని ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే.
కార్యక్రమంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ... ‘‘వైఎస్సార్ చేయూత పథకం ద్వారా గత సంవత్సరం దాదాపు 24 లక్షల మందికి రూ.18,750 చొప్పున జమ చేశాం. రెండవ ఏడాది ఇప్పుడు 23.44 లక్షల మంది అక్కచెల్లెమ్మలకు రూ.18,750 చొప్పున నేరుగా దాదాపు రూ.4,395 కోట్లు వారి అకౌంట్లలో జమ చేస్తున్నాం.’’ అని తెలిపారు. వైఎస్సార్ చేయూత పథకాన్ని తొలుత 2020, ఆగస్టు 12న ప్రారంభించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : వరుసగా రెండో ఏడాది వైఎస్సార్ చేయూత పథకం అమలు
ఎప్పుడు : జూన్ 22
ఎవరు : ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఎక్కడ : ఆంధ్రప్రదేశ్
ఎందుకు : రాష్జ్రంలో ఉన్న 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక స్వావలంబన కల్పించేందుకు

Published date : 23 Jun 2021 06:47PM