Skip to main content

వైఎస్సార్‌ బీమా పథకం తొలుత ఏ తేదీన ప్రారంభమైంది?

రేషన్‌ కార్డు(బియ్యం కార్డు) ఉండీ కుటుంబం ఆధార పడ్డ వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగితే ఆదుకునేందుకు ఉద్దేశించిన ‘వైఎస్సార్‌ బీమా’ పథకాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రారంభించారు.
Current Affairs 2021–22 సంవత్సరానికి గాను రూ.750 కోట్ల ప్రీమియం మొత్తాన్ని జూలై 1న ఆయన తన క్యాంపు కార్యాలయం నుంచి కంప్యూటర్‌లో బటన్‌ నొక్కి విడుదల చేశారు. అనంతరం సీఎం ప్రసంగిస్తూ... వైఎస్సార్‌ బీమా పథకం కోసం ఈ రెండేళ్లలో మనందరి ప్రభుత్వం రూ.1,307 కోట్లు ఖర్చు చేసిందన్నారు.

ప్రీమియం భారం ప్రభుత్వానిదే...
బీమా పథకాన్ని గతంలో ఎల్‌ఐసీతో కలసి కేంద్ర ప్రభుత్వం అమలు చేసేది. కేంద్రం 2020 ఏప్రిల్‌ 1 నుంచి ఈ పథకం నుంచి తప్పుకుంది. దీంతో బీమా పథకం పూర్తి ప్రీమియాన్ని రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుంది. ఈ మేరకు రూ.750 కోట్ల నిధులను విడుదల చేసింది. ఈ పథకం ద్వారా 1.32 కోట్ల కుటుంబాలకు ప్రయోజనం కలగనుంది. వైఎస్సార్‌ బీమా పథకం తొలుత 2020, అక్టోబర్‌ 2న ప్రారంభమైంది.

సీఎం ప్రసంగం–ముఖ్యాంశాలు
  • పేద కుటుంబం మీద ఒక్క రూపాయి కూడా భారం పడకుండా వైఎస్సార్‌ బీమా పథకం పూర్తి వ్యయాన్ని మన ప్రభుత్వమే భరిస్తుంది.
  • 18 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద సహజంగా మరణిస్తే ఆ కుటుంబానికి రూ.లక్ష ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకున్నాం.
  • 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు గల సంపాదించే కుటుంబ పెద్ద ప్రమాదంలో మరణించినా లేక శాశ్వత అంగవైకల్యం పొందినా ఆ కుటుంబానికి రూ.5 లక్షల బీమా పరిహారం ఇచ్చేలా పథకాన్ని రూపొందించాం.
Published date : 02 Jul 2021 06:40PM

Photo Stories