Skip to main content

వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ ఆవిష్కరణ

వైద్యం బిల్లు వెయ్యి రూపాయలు దాటితే వైఎస్సార్ ఆరోగ్య శ్రీ వర్తింప చేసే ప్రక్రియను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని మిగిలిన ఆరు జిల్లాలైన శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురంలకు విస్తరించే కార్యక్రమం ప్రారంభమైంది.

Current Affairs


నవంబర్ 10న ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తన క్యాంపు కార్యాలయంలో కంప్యూటర్‌లో బటన్ నొక్కి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. దీంతో పాటు కొత్తగా ఆరోగ్యశ్రీలో చేర్చిన 234 చికిత్సలను కలిపి మొత్తం 2,434 వైద్య చికిత్సలను రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు వర్తింప చేశారు.

ఆరోగ్యశ్రీ యాప్...
వైఎస్సార్ ఆరోగ్యశ్రీ యాప్ తెలుగు, ఇంగ్లిష్ వెర్షన్లను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆవిష్కరించారు. లబ్ధిదారులు ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకొని తమ హెల్త్ రికార్డులు పరిశీలించుకోవచ్చు. ఇందులో అన్ని ఆస్పత్రుల చిరునామా, చికిత్సల వివరాలు ఉన్నాయి.

ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రసంగం...

  • రాష్ట్రంలో 1.42 కోట్ల కుటుంబాలను ఆరోగ్య శ్రీ పథకం పరిధిలోకి తెచ్చాం. వార్షిక ఆదాయం రూ.5 లక్షల వరకు ఉన్న వారికి వర్తింపచేశాం. దీని వల్ల దాదాపు 95 శాతం కుటుంబాలకు పథకం వర్తిస్తోంది. హెల్త్ రికార్డులతో అనుసంధానం అయిన క్యూఆర్ కోడ్‌తో కూడిన కార్డులు జారీ చేశాం.
  • జనవరి 3న పశ్చిమ గోదావరి జిల్లాలో 2,059 చికిత్సలతో పైలట్ ప్రాజెక్టు ప్రారంభించాం. అదే సమయంలో మిగిలిన జిల్లాల్లో 1,313 రకాల చికిత్సలను పథకంలోకి తీసుకువచ్చాం.
  • గతంలో కేవలం 1,059 చికిత్సలు మాత్రమే ఉండేవి.
  • ఆరోగ్యశ్రీ పరిధి విస్తరిస్తూ, 2020, జూన్ 16న కర్నూలు, కడప, గుంటూరు, ప్రకాశం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమగోదావరి జిల్లాలకు విస్తరించాం. ఇప్పుడు మిగతా జిల్లాల్లోనూ వర్తింప చేశాం. కోవిడ్, పోస్ట్ కోవిడ్ చికిత్సను కూడా ఈ పథకం పరిధిలోకి తీసుకువచ్చాం.

క్విక్ రివ్యూ :

ఏమిటి : వైఎస్సార్ ఆరోగ్య శ్రీ పథకం విస్తరణ
ఎప్పుడు : నవంబర్ 10
ఎవరు : ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి
ఎక్కడ : శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కృష్ణా, నెల్లూరు, చిత్తూరు, అనంతపురం
ఎందుకు : వైద్యం కోసం పేద కుటుంబాలు ఇబ్బందిపడకూడదని
Published date : 11 Nov 2020 05:46PM

Photo Stories