Skip to main content

వైద్యరంగంలో ముగ్గురికి నోబెల్

వెద్యరంగంలో అందించిన విశిష్ట సేవలకు గానూ ముగ్గురు వైద్యులకు నోబెల్ బహుమతి లభించింది.
అమెరికాకు చెందిన డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్(హార్వర్డ్ యూనివర్సిటీ), డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెన్జా(హాప్కిన్స్ యూనివర్సిటీ), బ్రిటన్‌కు చెందిన డాక్టర్ పీటర్ జే రాట్‌క్లిఫ్(ఫ్రాన్సిస్ క్రిక్ ఇన్‌స్టిట్యూట్)లు నోబెల్ పురస్కారం-2019కు ఎంపికయ్యారు. వీరు ముగ్గురికి సంయుక్తంగా పురస్కారాన్ని అందజేయనున్నట్లు నోబెల్ కమిటీ అక్టోబర్ 7న ప్రకటించింది. ఈ ముగ్గురు ప్రైజ్‌మనీ అయిన 9.18 (రూ. 6.51 కోట్లు)లక్షల అమెరికన్ డాలర్లను సమంగా పంచుకుంటారు.

శరీరంలోని కణాలు శరీరంలోని ఆక్సిజన్ స్థాయిలను ఎలా గుర్తిస్తాయో, ఆ స్థాయిలకు అనుగుణంగా తమ పనితీరును ఎలా మార్చుకుంటాయో అనే విషయం(హైపోక్సియా)పై ఈ ముగ్గురు శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. రక్తహీనత, కేన్సర్ తదితర వ్యాధుల చికిత్సలో ఈ పరిశోధనలు ఉపయోగపడతాయి. ఆక్సిజన్‌ను గ్రహించే విధానంలో మార్పు కలగజేసే ఔషధాల రూపకల్పన ద్వారా పలు వ్యాధులకు చికిత్స విధానాన్ని వీరు రూపొందించారు.

2018 సంవత్సరానికి గానూ అమెరికా సైంటిస్ట్ జేమ్స్ ఆలిసన్, జపాన్ శాస్త్రవేత్త తసుకు హోంజోలకు వైద్య శాస్త్ర నోబెల్ లభించింది. డైనమైట్‌ను రూపొందించిన ప్రఖ్యాత శాస్త్రవేత్త అల్‌ఫ్రెడ్ నోబెల్ పేరున ఇచ్చే ఈ పురస్కారాలను, ప్రతీ సంవత్సరం ఆయన వర్థంతి రోజైన డిసెంబర్ 10న ప్రదానం చేస్తారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వైద్యరంగంలో నోబెల్ పురస్కారం-2019 విజేతలు
ఎప్పుడు : అక్టోబర్ 7
ఎవరు : డాక్టర్ విలియమ్ జీ కెలీన్ జూనియర్, డాక్టర్ గ్రెగ్ ఎల్ సెమెనా, డాక్టర్ పీటర్ జే రాట్‌క్లిఫ్
ఎందుకు : శరీరంలోని కణాలు-ఆక్సిజన్ అనే విషయంపై పరిశోధనలు చేసినందుకు
Published date : 09 Oct 2019 06:11PM

Photo Stories