Skip to main content

వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్

మహిళలపై జరుగుతున్న వరుస పైశాచిక దాడులు దేశాన్ని వణికిస్తున్నాయని, నైతికంగా దెబ్బ తీస్తున్నాయని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అన్నారు.
Current Affairsరాజస్తాన్‌లోని అబూరోడ్‌లో బ్రహ్మకుమారీల ఆధ్వర్యంలో మహిళా సాధికారతపై డిసెంబర్ 6వ తేదీన జరిగిన జాతీయ సదస్సులో రాష్ట్రపతి ప్రసంగించారు. లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి తీసుకువచ్చిన ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే హక్కు లేకుండా పార్లమెంటు రాజ్యాంగాన్ని సవరించాల్సిన అవసరం ఉందని అన్నారు. ‘అత్యాచార నేరాల్లో ఉరి శిక్ష పడిన వారందరూ క్షమాభిక్ష కోరుతూ పిటిషన్లు దాఖలు చేస్తారు. వారికి రాజ్యాంగం ఆ హక్కుని కల్పించింది. అయితే పోక్సో చట్టం కింద శిక్ష పడిన వారికి ఆ హక్కు ఉండకూడదు. ఆ దిశగా కేంద్రం అడుగులు వెయ్యాలి. చట్టాలను పునఃసమీక్షించాలి’అని సూచించారు.

క్విక్ రివ్వూ:
ఏమిటి: ది ప్రొటక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ (పోక్సో) చట్టం కింద ఉరిశిక్ష పడిన వారికి క్షమాభిక్ష కోరే అర్హత లేదు
ఎవరు: రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎప్పుడు: డిసెంబర్ 6, 2019
ఎక్కడ: మౌంట్ అబూ (రాజస్తాన్)
ఎందుకు: లైంగిక వేధింపులు, దాడుల నుంచి చిన్నారుల్ని రక్షించడానికి
Published date : 07 Dec 2019 05:13PM

Photo Stories