Skip to main content

వాణిజ్య వివాదంపై చర్చలకు సిద్ధం: చైనా

అమెరికాతో నెలకొన్న వాణిజ్య వివాదంపై అమెరికాతో చర్చలకై నా, యుద్ధానికై నా తాము సిద్ధంగా ఉన్నామని చైనా స్పష్టం చేసింది.
సింగపూర్‌లో ఐఐఎస్‌ఎస్ షాంగ్రి-లా సదస్సుకు హాజరైన సందర్భంగా చైనా రక్షణ మంత్రి జనరల్ వై ఫెంగీ ఈ విధంగా పేర్కొన్నారు. దేశభద్రత పేరిట చైనా టెలికం కంపెనీ హువావేపై అమెరికా ఆంక్షలు విధించడం అర్ధరహితమని ఫెంగీ అన్నారు. 539 బిలియన్ డాలర్ల పైగా ఉన్న వాణిజ్య లోటును భర్తీ చేయాలంటూ చైనా మీద అమెరికా ఒత్తిడి తెస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు 250 బిలియన్ డాలర్ల విలువ చేసే చైనా దిగుమతులపై అమెరికా ప్రభుత్వం ఇటీవలే సుంకాలు పెంచింది. ప్రతిగా చైనా కూడా 60 బిలియన్ డాలర్ల విలువ చేసే అమెరికన్ దిగుమతులపై టారిఫ్‌లు పెంచింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
అమెరికాతో వాణిజ్య వివాదంపై చర్చలకు సిద్ధం
ఎప్పుడు : జూన్ 2
ఎవరు : చైనా రక్షణ మంత్రి జనరల్ వై ఫెంగీ
Published date : 03 Jun 2019 05:59PM

Photo Stories