Skip to main content

వాహన నేరాలకూ ఐపీసీ వర్తింపు: సుప్రీం

మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని సుప్రీంకోర్టు స్పష్టంచేసింది.
ఈ రెండూ చట్టాలు వాటి పరిధుల్లో చక్కగా పనిచేస్తున్నాయని పేర్కొంది. మోటారు వాహన చట్టానికి చెందిన కేసులను ఐపీసీ కింద పరిగణించలేమంటూ 2008 డిసెంబరు 22న గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును విచారిస్తూ సుప్రీంకోర్టు అక్టోబర్ 6న ఈ వ్యాఖ్యలు చేసింది. గౌహతి హైకోర్టు ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. జస్టిస్ ఇందు మల్హోత్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాల ధర్మాసనం ఈ కేసును విచారించింది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
వాహన నేరాలకూ ఐపీసీ వర్తింపు
ఎప్పుడు : అక్టోబర్ 6
ఎవరు : సుప్రీంకోర్టు
ఎందుకు : మోటారు వాహన చట్టాన్ని అతిక్రమించిన వారు భారతీయ శిక్షా స్మృతి (ఐపీసీ)ని కూడా అతిక్రమించినట్లేనని
Published date : 09 Oct 2019 06:05PM

Photo Stories