ఉత్తరప్రదేశ్‌లో జడ్పీ చైర్‌పర్సన్‌గా ఎంపికైన తొలి తెలుగు మహిళ?
Sakshi Education
ఇటీవల జరిగిన ఉత్తరప్రదేశ్ జిల్లా పరిషత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ క్లీన్‌స్వీప్ చేసిన విషయం తెలిసిందే. కాగా, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఓ మహిళ ఇక్కడ ఓ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
కుటుంబ నేపథ్యం:
సూర్యపేట జిల్లా నడిగూడెం మండలం రత్నవరానికి చెందిన శ్రీకళారెడ్డి ఉత్తరప్రదేశ్‌లోని జన్పూర్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా బీజేపీ నుంచి ఎన్నికయ్యారు. ఈమె మాజీ ఎమ్మెల్యే కీసర జితేందర్ రెడ్డి కుమార్తె. గతంలో కోదాడ నియోజకవర్గ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్న శ్రీకళారెడ్డికి యూపీకి చెందిన ధనుంజయ్‌తో వివాహం జరిగింది.
రాజకీయాల్లో చురుకుగా..
జడ్పీ చైర్‌పర్సన్‌గా శ్రీకళా రెడ్డి.. యూపీలోనే నివాసం ఉంటున్న ధనుంజయ్-శ్రీకళ దంపతులు బీజేపీలో చేరి రాజకీయాల్లో చురుకుగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలో యూపీలో జరిగిన జిల్లా పరిషత్ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి జడ్పీటీసీ సభ్యురాలిగా ఎన్నికయ్యారు. ఆ తర్వాత జన్పూర్ పరిషత్ చైర్‌పర్సన్‌గా ఎన్నుకున్నారు.

Published date : 05 Jul 2021 06:40PM