ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గెర్సాయిన్
Sakshi Education
ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా చమోలీ జిల్లాలోని గెర్సాయిన్ ప్రాంతాన్ని ఎంపిక చేశారు.
ఈ విషయాన్ని ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్ మార్చి 4న రాష్ట్ర శాసనసభలో ప్రకటించారు. చమోలి జిల్లాను వేసవి రాజధానిగా ప్రకటించాలని స్థానికులు దీర్ఘకాలంగా డిమాండ్ చేస్తున్నారు. అలాగే గెర్సాయిన్ (భరాదిసైన్)ను వేసవి రాజధానిగా ప్రకటించాలంటూ బీజేపీ ఎన్నికల తీర్మానం కూడా చేసింది. మరోవైపు గెర్సాయిన్‌ను రాష్ట్ర వేసవి రాజధానిగా ప్రకటించాలని కర్ణప్రయాగ ఎమ్మెల్యే సురేంద్రసింగ్ నేగి ఇటీవల ముఖ్యమంత్రితో సమావేశం సందర్భంగా డిమాండ్ చేసినట్లు మీడియా కథనాలు వెల్లడించాయి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గెర్సాయిన్
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తరాఖండ్ వేసవి రాజధానిగా గెర్సాయిన్
ఎప్పుడు : మార్చి 4
ఎవరు : ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి త్రివేంద్రసింగ్ రావత్
Published date : 05 Mar 2020 06:03PM