ఉత్తర కొరియా రాయబారికి మరణశిక్ష
Sakshi Education
అమెరికాలో తమ దేశ ప్రత్యేక రాయబారిగా పనిచేస్తున్న కిమ్ హయెక్ చోల్‌కు ఉత్తర కొరియా మరణశిక్ష అమలు చేసింది.
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను మోసం చేశారన్న ఆరోపణలతో ఆయనకు ఈ శిక్ష అమలు చేసినట్లు దక్షిణ కొరియా పత్రిక ది చోసన్ ఇల్బో తెలిపింది.వియత్నాం రాజధాని హనోయ్‌లో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ల మధ్య జరిగిన 2 రోజుల శిఖరాగ్ర సదస్సులో చోల్ కీలకంగా వ్యవహరించారు. కిమ్ హయెక్ చోల్‌కు మిరిమ్ విమానాశ్రయంలో ఫైరింగ్ స్క్వాడ్ మార్చి నెలలో మరణశిక్ష అమలు చేసింది. అలాగే ఆయనతోపాటు మరో నలుగురు విదేశాంగ అధికారులకు కూడా ఉరిశిక్ష విధించినట్లు తెలిపింది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తర కొరియా రాయబారి కిమ్ హయెక్ చోల్‌కు మరణశిక్ష
ఎప్పుడు : మే 31
ఎవరు : ఉత్తర కొరియా ప్రభుత్వం
ఎందుకు : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను మోసం చేశారన్న ఆరోపణలతో
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఉత్తర కొరియా రాయబారి కిమ్ హయెక్ చోల్‌కు మరణశిక్ష
ఎప్పుడు : మే 31
ఎవరు : ఉత్తర కొరియా ప్రభుత్వం
ఎందుకు : ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్‌ను మోసం చేశారన్న ఆరోపణలతో
Published date : 01 Jun 2019 05:34PM