Skip to main content

ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక(పీఎల్‌ఐ) పథకం

దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకాన్ని కేంద్ర ప్రభుత్వం అమలు చేయనుంది.
Current Affairs
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో నవంబర్ 11న జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో ఈ పథకం అమలుకు ఆమోదముద్ర వేశారు. ఈ పథకం ద్వారా ఐదేళ్ల వ్యవధిలో మొత్తం రూ. 2 లక్షల కోట్ల మేర రాయితీలు ఆయా రంగాలకు చెందిన పరిశ్రమలకు లభించనున్నాయి.

ప్రభుత్వ సంకల్పం...
ఆర్థిక వ్యవస్థ వృద్ధిని పుంజుకునేలా చేయడం, అలాగే దిగుమతులను తగ్గించి తద్వారా ఉపాధి అవకాశాలను సృష్టించాలనేది ప్రభుత్వ సంకల్పం. ఈ దిశగా దేశీ తయారీ రంగాన్ని ప్రోత్సహించడానికి పీఎల్‌ఐ పథకం తోడ్పాటును అందించనుంది. ఈ కొత్త పథకం కింద రూ.1,45,980 కోట్ల ఆర్థిక ప్రయోజనాన్ని ప్రభుత్వం కేటాయించనుంది. కాగా, ఇప్పటికే రూ.51,311 కోట్ల వ్యయానికి కేంద్రం ఆమోదం తెలిపింది. ‘ఆత్మనిర్భర్ భారత్’ (స్వావలంబన భారత్) లక్ష్యం సాకారం దిశగా దేశాన్ని నడిపించడంలో పీఎల్‌ఐ తోడ్పడుతుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పేర్కొన్నారు.

రంగాల వారీగా ప్రోత్సాహకాలు
(రూ. కోట్లలో)

ఆటోమొబైల్స్, వాహన విడిభాగాలు

57,042

అడ్వాన్స్ కెమిస్ట్రీ సెల్(ఏసీసీ) బ్యాటరీ

18,100

ఫార్మాసూటికల్స్

15,000

టెలికం, నెట్‌వర్కింగ్ ఉత్పత్తులు

12,195

ఆహారోత్పత్తులు

10,900

టెక్స్‌టైల్స్ ఉత్పత్తులు

10,683

స్పెషాలిటీ స్టీల్

6,322

వైట్ గూడ్‌‌స

6,238

ఎలక్ట్రానిక్స్, టెక్నాలజీ ఉత్పత్తులు

5,000

అధిక సామర్థ్య సోలాల్ పీవీ మాడ్యూల్స్

4,500


క్విక్ రివ్యూ :

ఏమిటి : ఉత్పాదక ఆధారిత ప్రోత్సాహక (పీఎల్‌ఐ) పథకం ప్రకటన
ఎప్పుడు : నవంబర్ 11
ఎవరు : కేంద్ర ప్రభుత్వం
ఎందుకు : దేశంలో టెలికం, ఆటోమొబైల్, ఫార్మాసూటికల్స్ వంటి మరో 10 కీలక తయారీ పరిశ్రమలకు మరింత చేయూతనిచ్చేందుకు
Published date : 12 Nov 2020 05:37PM

Photo Stories