Skip to main content

ఉమాంగ్ ప్లాటినం పార్టనర్ అవార్డును గెలుచుకున్న సంస్థ?

ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలు రిజిస్టర్ చేసినందుకుగాను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓకు ప్లాటినం పార్టనర్ అవార్డు లభించింది.
Current Affairs
ఉమాంగ్ యాప్‌ను ఆవిష్కరించి 3 సంవత్సరాలైన సందర్భంగా కేంద్ర సమాచార శాఖ మంత్రి రవిశంకర్‌ప్రసాద్ నవంబర్ 25న ఉమాంగ్ పార్టనర్ అవార్డులను ప్రకటించారు. అన్ని సేవల్లో గత ఆరు నెలల్లో జరిగిన లావాదేవీల సరాసరి ఆధారంగా ఈ అవార్డులు ప్రకటించారు. ఇందులో 25 లక్షల లావాదేవీలు జరిపినందుకుగాను ఈపీఎఫ్‌ఓ ప్లాటినం అవార్డును గెలుచుకుంది.

ఉమాంగ్ గురించి...
ప్రజలకు సులువుగా, త్వరగా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకుని రావాలన్న లక్ష్యంతో... ఉమాంగ్ (UMANG-The Unified Mobile Application for New-age Governance) యాప్‌ను రూపొందించారు. ఎలక్టాన్రిక్స్ ఐటీ మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్(ఎన్‌ఈజీపీ) ఉమాంగ్ యాప్‌ను అభివృద్ధి చేసింది. 2017, నవంబర్ 23న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 163 సేవలతో ఈ యాప్‌ను జాతికి అంకితం చేశారు. 13 భారతీయ భాషలలో అందుబాటులో ఉన్న ఈ యాప్ ప్రస్తుతం 2039 సేవలను అందిస్తోంది.

విదేశాలలోనూ...
భారత విదేశీ మంత్రిత్వ శాఖ సహకారంతో అమెరికా, కెనడా,యూకే , ఆస్ట్రేలియా, యూఏఈ , నెథర్లాండ్స్ , సింగపూర్, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ వంటి దేశాలలో ఉమాంగ్ యాప్‌ను విడుదల చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సేవలను విదేశాలలో చదువుతున్న విద్యార్థులు, ప్రవాస భారతీయులు, విదేశీ పర్యాటకులు పొందగలుగుతారు.

క్విక్ రివ్యూ :

ఏమిటి : ఉమాంగ్ ప్లాటినం పార్టనర్ అవార్డును గెలుచుకున్న సంస్థ
ఎప్పుడు : నవంబర్ 25
ఎవరు : ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ సంస్థ ఈపీఎఫ్‌ఓ
ఎందుకు : ఉమాంగ్ యాప్‌పై 25 లక్షల లావాదేవీలు రిజిస్టర్ చేసినందుకుగాను
Published date : 26 Nov 2020 05:54PM

Photo Stories