Skip to main content

ఉక్రెనియన్‌ రెజ్లింగ్‌ టోర్నీలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి?

అవుట్‌స్టాండింగ్‌ ఉక్రెనియన్‌ రెజ్లర్స్‌ అండ్‌ కోచెస్‌ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నమెంట్‌లో... భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌ స్వర్ణ పతకం సాధించింది.
Current Affairs
ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌లో ఫిబ్రవరి 28న జరిగిన 53 కేజీల విభాగం ఫైనల్లో వినేశ్‌... ప్రస్తుతం యూరోపియన్‌ చాంపియన్, 2017 వరల్డ్‌ చాంపియన్‌ వానెస్సా కలాద్‌జిన్‌స్కాయ్‌ (బెలారస్‌)ను ‘బై ఫాల్‌’ పద్ధతిలో ఓడించి చాంపియన్‌గా అవతరించింది.

అడిలైడ్‌ ఓపెన్‌ విజేత స్వియాటెక్‌...
పోలాండ్‌ టీనేజ్‌ టెన్నిస్‌ స్టార్, ఫ్రెంచ్‌ ఓపెన్‌ మహిళల సింగిల్స్‌ చాంపియన్‌ ఇగా స్వియాటెక్‌ కెరీర్‌లో రెండో టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫిబ్రవరి 27న ముగిసిన అడిలైడ్‌ ఓపెన్‌లో 19 ఏళ్ల స్వియాటెక్‌ విజేతగా నిలిచింది. ఫైనల్లో ప్రపంచ 18వ ర్యాంకర్‌ స్వియాటెక్‌ 6–2, 6–2తో 12వ ర్యాంకర్‌ బెలిండా బెన్సిచ్‌ (స్విట్జర్లాండ్‌)పై గెలిచింది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : అవుట్‌స్టాండింగ్‌ ఉక్రెనియన్‌ రెజ్లర్స్‌ అండ్‌ కోచెస్‌ స్మారక అంతర్జాతీయ రెజ్లింగ్‌ టోర్నిలో స్వర్ణం గెలిచిన భారత క్రీడాకారిణి?
ఎప్పుడు : ఫిబ్రవరి 28
ఎవరు : భారత మహిళా స్టార్‌ రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌
ఎక్కడ : కీవ్, ఉక్రెయిన్‌
Published date : 01 Mar 2021 06:11PM

Photo Stories