Skip to main content

ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం?

2021 ఏడాదిలో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల్లో రాజస్తాన్‌ మొదటి స్థానంలో ఉండనుంది.
Edu news

రాజస్తాన్‌ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉండనుంది. వీబాక్స్, కాన్ఫెడరేషన్ఆఫ్ఇండియన్ఇండస్ట్రీ (సీఐఐ) కలసి దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించి రూపొందించిన ‘‘ఇండియా స్కిల్రిపోర్టు–2021’’లో ఈ విషయం వెల్లడైంది. ఈ సర్వేలోని వివరాల ప్రకారం... పట్టణాల పరంగా ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న వాటిల్లో హైదరాబాద్మొదటి స్థానంలో.. బెంగళూరు రెండో స్థానంలో ఉండనుంది. బెంగళూరు తర్వాత వరుసగా... కోయంబత్తూరు, ఈరోడ్, లక్నో నగరాలు ఉన్నాయి.

నివేదికలోని ముఖ్యాంశాలు

  1. దేశవ్యాప్తంగా 2020లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు 41.25 శాతం ఉంటే 2021లో 46.8 శాతానికి పెరగనున్నారు.
  2. 2021లో ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన పురుషులు 45.91 శాతం మాత్రమే ఉంటారు.
  3. వివిధ రంగాల్లో పనిచేస్తున్న పురుషులు 2020లో 77 శాతం మంది ఉంటే ఇప్పుడు వారి సంఖ్య 64 శాతానికి తగ్గనుంది.
  4. 2020లో ఉద్యోగం చేసే మహిళలు 23 శాతం మంది ఉంటే 2021 ఏడాది వారి సంఖ్య 36 శాతానికి పెరగనుంది.

క్విక్‌ రివ్యూ :
ఏమిటి : ఉద్యోగార్హ నైపుణ్యాలు కలిగిన మహిళలు అత్యధికంగా ఉన్న రాష్ట్రం రాజస్తాన్‌
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : ఇండియా స్కిల్‌ రిపోర్టు–2021
ఎక్కడ : దేశంలో

Published date : 09 Mar 2021 06:50PM

Photo Stories