ఉభయ సభలనుద్దేశించి రాష్ట్రపతి ప్రసంగం
Sakshi Education
17వ లోక్‌సభ ప్రారంభమైన సందర్భంగా జూన్ 20న పార్లమెంటు సెంట్రల్ హాలులో జరిగిన ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ప్రసంగించారు.
ప్రజలకు సాధికారత కల్పించడం ద్వారానే పేదరిక నిర్మూలన సాధ్యమవుతుందనే ఉద్దేశంతో తమ ప్రభుత్వం పేదలకు నివాస, ఆరోగ్యపరమైన సౌకర్యాలు కల్పిస్తోందని తన ప్రసంగంలో తెలిపారు. ప్రస్తుతం దేశానికి జమిలి ఎన్నికలు అవసరమని ఒకే దేశం - ఒకే ఎన్నికలు అనే అభివృద్ధి కాముక ప్రతిపాదనపై గట్టిగా దృష్టి పెట్టాల్సిందిగా కోరుతున్నానన్నారు.
రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు
రాష్ట్రపతి ప్రసంగంలోని అంశాలు
- దేశ భద్రతకు ప్రభుత్వం అత్యంత అధిక ప్రాధాన్యతను ఇస్తోంది
- ఉగ్రవాదంపై భారత్ వైఖరికి ప్రపంచ దేశాలు మద్దతు ఉంది
- నవభారత నిర్మాణం సాధన దిశగా 21 రోజుల్లోనే ప్రభుత్వం.. రైతులు, సైనికులు, విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, మహిళలు, సమాజంలోని ఇతర వర్గాలు లక్ష్యంగా ఎన్నో నిర్ణయాలు తీసుకుంది
- వ్యవసాయ ఉత్పాదకతను పెంచేందుకు రానున్న సంవత్సరాల్లో రూ.25 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టడం జరుగుతుంది
- మహిళలకు సమాన హక్కులు కల్పించేలా ట్రిపుల్ తలాక్, నికా హలాల వంటి సాంఘిక దురాచారాల నిర్మూలనలో ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తోంది
- అభివృద్ధిని ప్రోత్సహించడం, ఉద్యోగాల కల్పన లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని ప్రకటిస్తుంది
- దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 2022 నాటికి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ‘నవ భారతం’ను నిర్మించాలన్న సంకల్పంతో ప్రభుత్వం పనిచేస్తోంది
- లోక్‌సభలో సగం మంది ఎంపీలు కొత్తగా ఎన్నికై న వారు కావడం, మునుపెన్నడూ లేనివిధంగా 78 మంది మహిళా ఎంపీలుండటం నవభారత దృశ్యాన్ని మన ముందు ఉంచుతోంది.
Published date : 21 Jun 2019 05:32PM