Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 16 కరెంట్ అఫైర్స్
Janjatiya Gaurav Divas: రాణి కమలాపతి రైల్వేస్టేషన్ ఏ నగరంలో ఉంది?
జన జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా నవంబర్ 15న మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధాని భోపాల్‌లో నిర్వహించిన వేడుకల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొని, ప్రసంగించారు. అనంతరం ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌ను జాతికి అంకితం చేశారు. అలాగే ఆంధ్రప్రదేశ్, తదితర రాష్ట్రాల్లో ఏర్పాటు చేయనున్న 50 ఏకలవ్య రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి వర్చువల్ విధానం ద్వారా శంకుస్థాపన చేశారు.
కమలాపతి స్టేషన్: భోపాల్ నగరంలో ఉన్న హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ పేరును రాణి కమలాపతి రైల్వే స్టేషన్‌గా మధ్యప్రదేశ్ ప్రభుత్వం మార్చింది. గోండ్ రాణి అయిన రాణి కమలాపతి జ్ఞాపకార్థం... హబీబ్‌గంజ్ రైల్వే స్టేషన్ పేరు మార్పు నిర్ణయం తీసుకున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది.
జన జాతీయ గౌరవ్ దివస్: బ్రిటిష్ వలసవాదం, దోపిడీకి వ్యతిరేకంగా ఉద్యమించిన గిరిజన యోధుడు బిర్సా ముండా జయంతిని పురస్కరించుకుని... గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల స్మారకార్థం నవంబర్ 15వ తేదీని జన జాతీయ గౌరవ్ దివస్‌గా జరుపుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం విదితమే. గిరిజనుల విజయాలు, సంస్కృతిని స్మరించుకుంటూ ప్రతి ఏటా నవంబర్ 15 నుంచి వారం రోజులపాటు వేడుకలు నిర్వహించాలని నిర్ణయించింది.
ప్రధాని మోదీ ప్రసంగం–ముఖ్యాంశాలు
- గోండ్ రాణి దుర్గావతి ధైర్యసాహసాలు, రాణి కమలాపతి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదు.
- అంబేద్కర్ జయంతి, గాంధీ జయంతి, వీర్‌సావర్కర్ జయంతిల మాదిరిగానే భగవాన్ బిర్సాముండా జయంతిని ఏటా నవంబర్ 15న నిర్వహిస్తాం.
- గత ప్రభుత్వాల వీఐపీ సంస్కృతి నుంచి ఈపీఐ(ప్రతి వ్యక్తీ ముఖ్యుడే) సాధన దిశగా దేశం ప్రస్తుతం పరివర్తన చెందుతోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఆధునీకరించిన రాణి కమలాపతి రైల్వే స్టేషన్ ప్రారంభం
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
ఎక్కడ : భోపాల్, మధ్యప్రదేశ్
ఎందుకు : జన జాతీయ గౌరవ్ దివస్ సందర్భంగా..
Historian: జానతా రాజా నాటకాన్ని రూపొందించిన పద్మవిభూషణ్ అవార్డీ?
ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత బల్వంత్ మోరేశ్వర్ పురందరే(99) అనారోగ్య కారణాలతో కన్నుమూశారు. నిమోనియాతో బాధపడుతున్న ఆయన నవంబర్ 15న పూణెలోని ఓ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. మరాఠా యోధుడు ఛత్రపతి శివాజీ మహరాజ్‌పై విశేషమైన పరిశోధనలతో పురందరే దేశంలోనే ఖ్యాతికెక్కారు. ఆయన 1950లలో రాజా శివచక్రవర్తి పేరిట రాసిన పుస్తకం, జానతా రాజా పేరుతో రూపొందించిన నాటకం ఎంతో ప్రసిద్ధి చెందాయి. బాబాసాహెబ్ పురందరేగా చిరపరిచితుడైన పురందరేను 2015లో మహారాష్ట్ర భూషణ్ అవార్డు వరించింది. 2019లో కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మవిభూషణ్ అవార్డును స్వీకరించారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ప్రముఖ చరిత్రకారుడు, పద్మ విభూషణ్ పురస్కార గ్రహీత కన్నుమూత
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : బల్వంత్ మోరేశ్వర్ పురందరే(99)
ఎక్కడ : పూణె, మహారాష్ట్ర
ఎందుకు : అనారోగ్య కారణాలతో...
LLC Commissioner: రిటైర్డ్ క్రికెట్ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన లీగ్ పేరు?
భారత హెడ్ కోచ్ పదవి నుంచి వైదొలిగిన రవిశాస్త్రి మరో కొత్త పాత్రలో కనిపించనున్నాడు. రిటైర్డ్ ప్లేయర్ల కోసం ఏర్పాటు చేసిన లెజెండ్స్ లీగ్ క్రికెట్ (ఎల్‌ఎల్‌సీ) కమిషనర్‌గా రవిశాస్త్రి వ్యవహరిస్తాడు. ఈ విషయాన్ని లీగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈవో రామన్ రహేజా తెలిపారు. ఎల్‌ఎల్‌సీ తొలి సీజన్ 2022, జనవరిలో గల్ఫ్‌లో ఆరంభం కానుంది. ఇందులో భారత్, ఆస్ట్రేలియా, ఇంగ్లండ్, శ్రీలంక, పాకిస్తా¯Œ దేశాలకు చెందిన మాజీ ఆటగాళ్లు పాల్గొంటారు.
బ్రెజిల్ గ్రాండ్‌ప్రిలో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఫార్ములావన్ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి–2021లో మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్ విజేతగా అవతరించాడు. బ్రెజిల్‌లోని సావోపాలో నగరంలో నవంబర్ 15న జరిగిన ప్రధాన రేసులో 71 ల్యాప్‌ల దూరాన్ని హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసి విజేతగా నిలిచి టైటిల్ కైవసం చేసుకున్నాడు. హామిల్టన్ కెరీర్‌లో ఇది 101వ విజయం. 10.496 సెకన్లు వెనుకగా రేసును పూర్తి చేసిన వెర్‌స్టాపెన్ (రెడ్‌బుల్) రెండో స్థానంలో నిలిచాడు. మరో మెర్సిడెస్ డ్రైవర్ వాల్తెరి బొటాస్ మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఫార్ములావన్ రేసు బ్రెజిల్ గ్రాండ్‌ప్రి–2021లో విజేతగా నిలిచిన మెర్సిడెస్ డ్రైవర్?
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : మెర్సిడెస్ డ్రైవర్ లూయిస్ హామిల్టన్
ఎక్కడ : సావోపాలో, బ్రెజిల్
ఎందుకు : ప్రధాన రేసులో 71 ల్యాప్‌ల దూరాన్ని హామిల్టన్ అందరికంటే ముందుగా గంటా 32 నిమిషాల 22.851 సెకన్లలో పూర్తి చేసినందున...
First Gay Judge: హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తొలి స్వలింగ సంపర్కుడు?
సీనియర్ న్యాయవాది, స్వలింగ సంపర్కుడు(గే) అయిన సౌరభ్ కిర్పాల్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా సిఫార్సు చేస్తూ నవంబర్ 15న భారత సుప్రీంకోర్టు కొలీజియం నిర్ణయం తీసుకుంది. కొలీజియం సిఫార్సును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తే దేశంలోనే తొలి గే జడ్జిగా సౌరభ్ నిలవనున్నారు. ఆక్స్‌ఫర్ట్ యూనివర్సిటీలో ‘లా’లో అండర్ అండర్‌గ్రాడ్యుయేషన్, కేంబ్రిడ్జి యూనివర్సిటీలో మాస్టర్ డిగ్రీ చేసిన సౌరభ్.. సుప్రీంకోర్టులో రెండు దశాబ్దాలకుపైగా లాయర్‌గా ఉన్నారు. తొలిసారిగా 2017 అక్టోబర్‌లోనే ఆయనకు పదోన్నతి కల్పించాలంటూ ఢిల్లీ హైకోర్టు కొలీజియం సిఫార్సు చేసినా అది కార్యరూపం దాల్చలేదు. ఆయన పేరును సిఫార్సు చేయడం ఇది నాలుగోసారి.
క్విక్ రివ్యూ :
ఏమిటి : హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులు కానున్న తొలి స్వలింగ సంపర్కుడు?
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : సీనియర్ న్యాయవాది, స్వలింగ సంపర్కుడు(గే) సౌరభ్ కిర్పాల్
ఎక్కడ : దేశంలో...
ఎందుకు : సౌరభ్‌ను ఢిల్లీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమించాలని.. సుప్రీంకోర్టు కొలీజియం కేంద్రానికి సిఫార్సు చేసిన నేపథ్యంలో...
Tribal Museum: దేశంలోని ఏ రాష్ట్రంలో రాంజీ గోండ్ మ్యూజియం ఏర్పాటు కానుంది?
గిరిజన, ఆదివాసీల్లోని మహానేతల స్మృతికి చిహ్నంగా, వారి చరిత్ర, సంస్కృతిని ప్రతిబింబించేలా మ్యూజియాలను నిర్మించాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఇప్పటికే నిర్ణయించింది. ఈ నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో... స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల హక్కుల ఉద్యమకారుడు రాంజీ గోండ్ పేరిట మ్యూజియం ఏర్పాటుకానుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో రూ.18 కోట్లతో దీనిని నిర్మించనున్నారు. మ్యూజియం నిర్మాణ పనులను త్వరలో ప్రారంభించనున్నట్లు నవంబర్ 15న తెలంగాణ రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తెలిపారు. ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్(టీఆర్‌ఐ) ఆధ్వర్యంలో మ్యూజియం నిర్మాణానికి సంబంధించి నమూనా రూపుదిద్దుకుంటోంది. ఈ మ్యూజియానికి కేంద్రం రూ.15 కోట్లు కేటాయించగా, రాష్ట్ర ప్రభుత్వం రూ.3 కోట్లు ఇస్తోంది.
క్విక్ రివ్యూ :
ఏమిటి : స్వాతంత్య్ర సమరయోధుడు, గిరిజనుల హక్కుల ఉద్యమకారుడు రాంజీ గోండ్ పేరిట మ్యూజియం ఏర్పాటు
ఎప్పుడు : నవంబర్ 15
ఎవరు : కేంద్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం
ఎక్కడ : హైదరాబాద్, తెలంగాణ
ఎందుకు : గిరిజన–ఆదివాసీల్లోని మహానేతల స్మృతికి చిహ్నంగా, వారి చరిత్ర, సంస్కృతిని తెలిపేందుకు..
National Sports Awards 2021: జాతీయ క్రీడా పురస్కారాల పూర్తి జాబితా
అంతర్జాతీయ స్థాయిలో తమ ప్రతిభాపాటవాలతో దేశ కీర్తి ప్రతిష్టలను ఇనుమడింపజేస్తున్న భారత మేటి క్రీడాకారులను కేంద్ర ప్రభుత్వం జాతీయ క్రీడా పురస్కారాలతో సత్కరించింది. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో నవంబర్ 13న జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ చేతుల మీదుగా 2021 సంవత్సరానికిగాను క్రీడాకారులు ఈ అవార్డులు అందుకున్నారు. అవార్డు విజేతల వివరాలు ఇలా..
మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న 2021(12):
2021 ఏడాదికిగాను దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న’కు ఒకేసారి అత్యధికంగా 12 మందిని ఎంపిక చేశారు. గతంలో 2020లో ఒకేసారి అత్యధికంగా ఐదుగురికి ఖేల్ రత్న అవార్డును ఇచ్చారు. ‘ఖేల్ రత్న’ అవార్డీలకు రూ. 25 లక్షల చొప్పున ప్రైజ్‌మనీతోపాటు పతకం, ప్రశంసాపత్రం అందజేశారు.
సంఖ్య |
పేరు |
క్రీడాంశం |
1 |
నీరజ్ చోప్రా |
అథ్లెటిక్స్ |
2 |
మిథాలీ రాజ్ |
క్రికెట్ |
3 |
సునీల్ ఛెత్రి |
ఫుట్‌బాల్ |
4 |
రవికుమార్ దహియా |
రెజ్లింగ్ |
5 |
పీఆర్ శ్రీజేశ్ |
హాకీ |
6 |
లవ్లీనా బోర్గోహెయిన్ |
బాక్సింగ్ |
7 |
ప్రమోద్ భగత్ |
పారా బ్యాడ్మింటన్ |
8 |
సుమీత్ అంటిల్ |
పారా అథ్లెటిక్స్ |
9 |
అవని లేఖరా |
పారా షూటింగ్ |
10 |
కృష్ణ నాగర్ |
పారా బ్యాడ్మింటన్ |
11 |
మనీశ్ నర్వాల్ |
పారా షూటింగ్ |
12 |
మన్‌ప్రీత్ సింగ్ |
హాకీ |
అర్జున అవార్డు 2021(35):
2021 ఏడాదికి మొత్తం 35 మంది అర్జున అవార్డుకు ఎంపికయ్యారు. అర్జున అవార్డీలకు రూ. 15 లక్షల ప్రైజ్‌మనీ, ప్రతిమ, ప్రశంసాపత్రం ఇచ్చారు.
సంఖ్య |
పేరు |
క్రీడాంశం |
1 |
అర్పిందర్ సింగ్ |
అథ్లెటిక్స్ |
2 |
సిమ్రన్‌జీత్ కౌర్ |
బాక్సింగ్ |
3 |
శిఖర్ ధావన్ |
క్రికెట్ |
4 |
భవానీ దేవి చదలవాడ ఆనంద సుందరరామన్ |
ఫెన్సింగ్ |
5 |
మౌనిక |
హాకీ |
6 |
వందన కటారియా |
హాకీ |
7 |
సందీప్ నర్వాల్ |
కబడ్డీ |
8 |
హిమాని ఉత్తమ్ పరబ్ |
మల్లకంబ్ |
9 |
అభిషేక్ వర్మ |
షూటింగ్ |
10 |
అంకిత రైనా |
టెన్నిస్ |
11 |
దీపక్ పునియా |
రెజ్లింగ్ |
12 |
దిల్‌ప్రీత్ సింగ్ |
హాకీ |
13 |
హర్మన్ ప్రీత్ సింగ్ |
హాకీ |
14 |
రూపీందర్ పాల్ సింగ్ |
హాకీ |
15 |
సురేందర్ కుమార్ |
హాకీ |
16 |
అమిత్ రోహిదాస్ |
హాకీ |
17 |
బీరేంద్ర లక్రా |
హాకీ |
18 |
సుమిత్ |
హాకీ |
19 |
నీలకంఠ శర్మ |
హాకీ |
20 |
హార్దిక్ సింగ్ |
హాకీ |
21 |
వివేక్ సాగర్ ప్రసాద్ |
హాకీ |
22 |
గుర్జాంత్ సింగ్ |
హాకీ |
23 |
మన్‌దీప్ సింగ్ |
హాకీ |
24 |
షంషేర్ సింగ్ |
హాకీ |
25 |
లలిత్ కుమార్ ఉపాధ్యాయ్ |
హాకీ |
26 |
వరుణ్ కుమార్ |
హాకీ |
27 |
సిమ్రత్‌జీత్ సింగ్ |
హాకీ |
28 |
యోగేశ్ కథూనియా |
పారా అథ్లెటిక్స్ |
29 |
నిషధ్ కుమార్ |
పారా అథ్లెటిక్స్ |
30 |
ప్రవీణ్ కుమార్ |
పారా అథ్లెటిక్స్ |
31 |
భవీనా పటేల్ |
పారా టేబుల్ టెన్నిస్ |
32 |
హర్వీందర్ సింగ్ |
పారా ఆర్చరీ |
33 |
శరద్ కుమార్ |
పారా అథ్లెటిక్స్ |
34 |
సుహాస్ యతిరాజ్ |
పారా బ్యాడ్మింటన్ |
35 |
సింగ్‌రాజ్ అధాన |
పారా షూటింగ్ |
ద్రోణాచార్య అవార్డు 2021: లైఫ్ టైమ్ కేటగిరీ(5)
సంఖ్య |
పేరు |
క్రీడాంశం |
1 |
టీ.పీ.ఉసెప్ |
అథ్లెటిక్స్ |
2 |
సర్కార్ తల్వార్ |
క్రికెట్ |
3 |
సర్పాల్‌సింగ్ |
హాకీ |
4 |
అషాన్ కుమార్ |
కబడ్డీ |
5 |
తపన్ కుమార్ పాణిగ్రహి |
స్విమ్మింగ్ |
ద్రోణాచార్య అవార్డు 2021: రెగ్యులర్ కేటగిరీ(5)
సంఖ్య |
పేరు |
క్రీడాంశం |
1 |
పి రాధాకృష్ణన్ నాయర్ |
అథ్లెటిక్స్ |
2 |
సంధ్య గురుంగ్ |
బాక్సింగ్ |
3 |
ప్రీతమ్ సివాచ్ |
హాకీ |
4 |
జైప్రకాశ్ నౌటియాల్ |
పారా షూటింగ్ |
5 |
సుబ్రమణియన్ రామన్ |
టేబుల్ టెన్నిస్ |
ద్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు (5):
సంఖ్య |
పేరు |
క్రీడాంశం |
1 |
కె.సి లేఖ |
బాక్సింగ్ |
2 |
అభిజీత్ కుంతే |
చెస్ |
3 |
దేవేందర్ సింగ్ గర్చా |
హాకీ |
4 |
వికాస్ |
కబడ్డీ |
5 |
సజ్జన్ సింగ్ |
రెజ్లింగ్ |
రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్(2):
సంఖ్య |
విభాగం |
విజేత(సంస్థ) |
1 |
ఐడెంటిఫికేషన్ అండ్ నర్చరింగ్ ఆఫ్ బడ్డింగ్ అండ్ యంగ్ టాలెంట్: |
మానవ్‌రచన ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ |
2 |
ఎన్‌కరేజ్‌మెంట్ టు స్పోర్ట్స్ థ్రూ కార్పొరేట్ సోషియల్ సోషల్ రెస్పాన్సిబిలిటీ: |
ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ |
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్(ఎమ్‌ఏకేఏ) ట్రోఫీ 2021: పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్
చదవండి: Daily Current Affairs in Telugu: 2021, నవంబర్ 15 కరెంట్ అఫైర్స్
డౌన్‌లోడ్ చేసుకోండి:
తాజా విద్యా సమాచారం, అన్ని రకాల పోటీ పరీక్షలకు సంబంధించిన కరెంట్ అఫైర్స్, స్టడీ మెటీరియల్‌తో పాటు తరగతులకు(అకాడెమిక్స్) సంబంధించిన స్టడీ మెటీరియల్‌ను పొందడానికి, కెరీర్ అవకాశాలను తెలుసుకోవడానికి సాక్షి ఎడ్యుకేషన్ యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి.
యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్