Daily Current Affairs in Telugu: 2022, జూన్ 07 కరెంట్ అఫైర్స్
Telangana Industries Department Annual Report Revealed: తెలంగాణ పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక వెల్లడి
గత ఆర్థిక సంవత్సరంలో తెలంగాణ రూ.17,867 కోట్ల పారిశ్రామిక పెట్టుబడులు సాధించింది. సుమారు 4 వేల పరిశ్రమలు రాగా, 96 వేలకు పైగా ఉద్యోగాలు లభించినట్లు పరిశ్రమల శాఖ వార్షిక నివేదిక (2021–22) పేర్కొంది. టీఎస్‌ఐఐసీ 810 ఎకరాల్లో 13 కొత్త పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసి 526 పరిశ్రమలకు కేటాయించింది. వీటి ద్వారా రూ.6,123 కోట్ల పెట్టుబడులు, 5,626 మందికి ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలు వస్తాయని అంచనా. తెలంగాణ ఏర్పడింది మొదలుకుని ఇప్పటి వరకు 19,961 ఎకరాల్లో 56 పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేసింది. మరో 15,620 ఎకరాల్లో పారిశ్రామిక పార్కుల ఏర్పాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.
నివేదికలోని ముఖ్యాంశాలు..
వాణిజ్య వాతావరణంలో నం.1
- నీతి ఆయోగ్ ‘ఎక్స్‌పోర్ట్ ప్రిపేర్డ్‌నెస్ ఇండెక్స్ 2021’ప్రకారం ఉత్తమ వాణిజ్య వాతావరణం కలిగిన రాష్ట్రాల్లో తెలంగాణది అగ్రస్థానం.
- నీతి ఆయోగ్ లెక్కల ప్రకారం విదేశాలకు ఎగుమతుల్లో 75% వాటా మహరాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణదే.
- దేశంలో వాణిజ్య, పారిశ్రామిక రంగ ర్యాంకుల్లో తెలంగాణది ప్రథమ స్థానం.
- దేశంలోనే తొలి ఐపీ మస్కట్ బడ్డీ ‘రచిత్’ను ఆవిష్కరించిన తొలి రాష్ట్రం తెలంగాణ.
జీఎస్‌డీపీలో 19.1% వృద్ధి
- ప్రస్తుత ధరల ప్రకారం చూస్తే 2021–22లో తెలంగాణ స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్‌డీపీ) రూ.11.54 లక్షల కోట్లు. జీఎస్‌డీపీలో రాష్ట్రం 19.1 శాతం వృద్ధిని నమోదు చేసింది.
- 2017–18 నుంచి 2021–22 మధ్యకాలంలో జీఎస్‌డీపీలో తెలంగాణ ఐదేళ్లలో 11.4 శాతం సీఏజీఆర్ (కాంపౌండ్ యాన్యువల్ గ్రోత్ రేట్) సాధించింది. ఇదే సమయంలో భారత్ 8.5 శాతం సీఏజీఆర్‌ను మాత్రమే సాధించింది.
- ప్రస్తుత ధరలతో పోల్చి చూస్తే 2014–15 నుం చి 2021–22 మధ్యకాలంలో తెలంగాణ జీఎస్‌డీపీ 128.3% వృద్ధి చెందగా, ఇదే కాలంలో భారత్ 89.6% మాత్రమే వృద్ధి సాధించింది.
తలసరి ఆదాయం రూ.2,78,833
- 2021–22లో రాష్ట్ర జీఎస్‌వీఏ (గ్రాస్ స్టేట్ వాల్యూ అడిషన్)లో వ్యవసాయం, దాని అనుబంధ రంగాల వాటా 18.3 శాతం, పారిశ్రామిక రంగం వాటా 20.4 శాతం, సేవా రంగం వాటా 18.3 శాతంగా నమోదైంది. జీఎస్‌వీఏకి గత ఏడాది ప్రాథమిక రంగం 18.3 శాతం, ద్వితీయరంగం 20.4 శాతం, తృతీయ రంగం 61.3 శాతాన్ని సమకూర్చాయి.
- 2021–22లో జాతీయ జీడీపీ లో తెలంగాణ వాటా 5 శాతం కాగా, రాష్ట్ర అవతరణ నాటి నుంచి ఒక శాతం పెరిగింది.
- తెలంగాణ తలసరి ఆదాయం రూ.2,78,833 కాగా జాతీయ స్థాయిలో రూ.1,49,848 మాత్రమే. 2014–15లో తెలంగాణ తలసరి ఆదాయం రూ.1,24,104 మాత్రమే కావడం గమనార్హం. 2014–15 నుంచి 2021–22 మధ్యకాలంలో తెలంగాణ తలసరి ఆదాయంలో 124.7 శాతం వృద్ధి నమోదైంది. జాతీయ స్థాయిలో ఈ వృద్ధి 72.9 శాతం మాత్రమే.
Indian athlete Avinash holds the national record for the eighth time: భారత అథ్లెట్ అవినాశ్ ఎనిమిదోసారి జాతీయ రికార్డు
- రబట్ (మొరాకో): వరుసగా కొత్త జాతీయ రికార్డులతో సత్తా చాటుతున్న భారత అథ్లెట్ అవినాశ్ సబ్లే మరో అరుదైన ఘనతను సాధించాడు. అథ్లెటిక్స్ ప్రపంచంలో ప్రతిష్టాత్మక ఈవెంట్‌గా గుర్తింపు ఉన్న డైమండ్ లీగ్‌లో అతను ఐదో స్థానంలో నిలిచాడు. 3000 మీటర్ల స్టీపుల్‌ఛేజ్‌లో అతను 8 నిమిషాల 12.48 సెకన్లలో గమ్యం చేరాడు.
- ఇది భారత్ తరఫున కొత్త జాతీయ రికార్డు. గత మార్చిలో తానే నమోదు చేసిన 8 నిమిషాల 16.21 సెకన్ల టైమింగ్‌ను దాదాపు మూడు సెకన్ల తేడాతో అవినాశ్ సవరించాడు. ఏకంగా ఎనిమిదిసార్లు అతను తన జాతీయ రికార్డులనే బద్దలు కొడుతూ కొత్త రికార్డులు నెలకొల్పడం విశేషం.
- గత నెలలో 5000 మీటర్ల పరుగును 13 నిమిషాల 25.65 సెకన్లలో పూర్తి చేసిన అవినాశ్... 30 ఏళ్లనాటి బహదూర్ ప్రసాద్ రికార్డు (13 నిమిషాల 29.70 సెకన్లు)ను తుడిచేశాడు. తాజా ఈవెంట్‌లో టోక్యో ఒలింపిక్స్ స్వర్ణపతక విజేత సూఫినాయ్ బకాలి (7 నిమిషాల 58.28 సెకన్లు)కి స్వర్ణం దక్కింది.
- Download Current Affairs PDFs Here
- PMJJBY: పీఎం జీవన్ జ్యోతి, సురక్ష బీమా... ప్రీమియం పెంపు
- యాప్ డౌన్‌లోడ్ ఇలా...
డౌన్‌లోడ్ వయా గూగుల్ ప్లేస్టోర్
Indo-Tibetan Border Police sets new record: 22,850 అడుగుల ఎత్తులో ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు యోగా
ఇండో–టిబెటన్ బోర్డర్ పోలీసు(ఐటీబీపీ) జవాన్లు సరికొత్త రికార్దు నెలకొల్పారు. ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని అబీ గామిన్ పర్వతం సమీపంలో సముద్ర మట్టానికి 22,850 అడుగుల ఎత్తున యోగా సాధన చేశారు. ఈ వీడియోను తమ అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకున్నారు. ఒకవైపు దట్టమైన మంచు, వణికించే చలి.. అయినప్పటికీ మొక్కవోని దీక్షతో యోగాసనాలు సులువుగా పూర్తిచేశారు. ఐటీబీపీ బృందం ఈ నెల 2వ తేదీన అబీ గామిన్ పర్వత శిఖరానికి చేరుకుంది. ‘బద్రీ విశాల్‌కీ జై’ అని నినదిస్తూ యోగా సాధనకు శ్రీకారం చుట్టింది. ఈ పర్వతం భారత్–టిబెట్ సరిహద్దులో ఉంది. ఈ ప్రాంతంలో ఇది రెండో అతిపెద్ద పర్వతం. బృందంలో మొత్తం 14 మంది ఉన్నారు.
Impact on our trade with the Gulf countries: గల్ఫ్‌తో మన వాణిజ్యంపై ప్రభావం!
ప్రవక్తపై అభ్యంతరకర వ్యాఖ్యల వివాదం చినికిచినికి గాలివానగా మారింది. ఆ వ్యాఖ్యలు చేసింది అధికార బీజేపీకి చెందిన నేతలు కావడంతో పలు ముస్లిం దేశాలు వాటిని కేంద్ర ప్రభుత్వ వైఖరిగా పరిగణిస్తున్నాయి. 57 ముస్లిం దేశాల సమాఖ్య ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కో ఆపరేషన్ (ఓఐసీ) ఆ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించడమే గాక భారత్‌లో ముస్లిం మైనారిటీల భద్రతపై జోక్యం చేసుకోవాలంటూ ఐరాసకు విజ్ఞప్తి చేసింది! ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండించిన దేశాల జాబితాలో తాజాగా ఇండొనేసియా, సౌదీ అరేబియా, యూఏఈ, జోర్డాన్, బహ్రెయిన్, అఫ్గానిస్తాన్ కూడా చేరాయి. దీనిపై తమ తీవ్ర అభ్యంతరాలను జకార్తాలోని భారత రాయబారికి తెలియపరిచినట్టు ఇండొనేసియా విదేశాంగ శాఖ ట్వీట్ చేసింది. యూఏఈతో పాటు మక్కా గ్రాండ్ మాస్క్, మదీనా ప్రాఫెట్స్ మాస్క్ వ్యవహారాల జనరల్ ప్రెసిడెన్సీ కూడా ఇలాంటి ప్రకటనలే చేశాయి. సౌదీ విదేశాంగ శాఖ ప్రవక్తపై వ్యాఖ్యలను ఖండిస్తూనే, సదరు నేతలపై బీజేపీ చర్యలను స్వాగతిస్తున్నట్టు పేర్కొంది. ఖతార్, కువైట్ ఒక అడుగు ముందుకేసి భారత్ క్షమాపణకు కూడా డిమాండ్ చేశాయి. బహ్రెయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ, యూఏఈలతో కూడిన ప్రాంతీయ, రాజకీయ, ఆర్థిక యూనియన్ అయిన గల్ఫ్ కో ఆపరేషన్ కౌన్సిల్ (జీసీసీ) కూడా బీజేపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించింది. జీసీసీ దేశాల్లో లక్షలాది మంది భారతీయులు పని చేస్తున్నారు.
సోషల్ మీడియాలోనూ విద్వేష ప్రచారం
భారత ఉత్పత్తులను బహిష్కరిస్తామని ఇస్లామిక్ దేశాల్లోని పలు ప్రముఖ సంస్థలు ప్రకటనలు చేస్తుండటం వివాదాన్ని మరింత జటిలంగా మార్చింది. తమ సూపర్ మార్కెట్లలో టీ పొడి తదితర భారత ఉత్పత్తుల విక్రయాలను ఆపేయాలని యోచిస్తున్నట్టు కువైట్‌లోని అల్–అర్దియా కో ఆపరేటివ్ సొసైటీ వంటివి ఇప్పటికే ప్రకటించాయి. పలు ముస్లిం దేశాల్లో ఇప్పటికే భారత ఉత్పత్తుల బహిష్కరణ మొదలైంది! అరబ్ ప్రపంచమంతా వాటిని నిషేధించాలంటూ ట్విట్టర్ తదితర సోషల్ మాధ్యమాల్లో ట్రెండింగ్ కూడా జరుగుతోంది. ఈ నేపథ్యంలో కేంద్రం హుటాహుటిన నష్ట నివారణ చర్యలకు దిగింది. అటు ఓఐసీ వ్యాఖ్యలను తీవ్ర పదజాలంతో ఖండిస్తూనే, అవి కొందరు వ్యక్తుల అనాలోచిత వ్యాఖ్యలే తప్ప భారత ప్రభుత్వ వైఖరిని ప్రతిబింబించేవి కానే కావని స్పష్టం చేసింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రతినిధి అరిందం బాగ్చీతో పాటు పలు ముస్లిం దేశాల్లోని భారత రాయబారులు స్థానికంగా కూడా ప్రకటనలు చేశారు.
బలమైన ఆర్థిక బంధం
- అరబ్ ప్రపంచం నుంచి వెల్లువెత్తుతున్న నిరసనలను శాంతింపజేసేందుకు భారత్ హుటాహుటిన రంగంలోకి దిగడానికి చాలా కారణాలే ఉన్నాయి. వాటిలో ముఖ్యమైనది పశ్చిమాసియాలోని ఈ ముస్లిం దేశాలతో మనకున్న బలమైన ఆర్థిక, వాణిజ్య సంబంధాలు. సౌదీ, కువైట్, ఖతర్, ఒమన్ తదితర దేశాల్లో భారతీయులు చాలా ఎక్కువగా ఉంటారు. యూఏఈ జనాభాలోనైతే 30 శాతం దాకా భారతీయులే. మొత్తమ్మీద ఈ ముస్లిం దేశాల్లో నివసిస్తున్న ఎన్నారైల సంఖ్య ఏకంగా 87 లక్షలని అంచనా. వీరిలో కార్మికులే అత్యధికంగా ఉంటారు.
- తాజా వివాదం నేపథ్యంలో వారి భద్రతపై అనుమానాలు నెలకొన్నాయి. గల్ఫ్ దేశాల్లోని భారతీయులు స్వదేశానికి పంపే మొత్తాలు (రెమిటెన్సులు) దేశ ఆర్థిక వ్యవస్థకు కీలకంగా మారాయి. 2021లో భారత్‌కు 87 బిలియన్ డాలర్ల రెమిటెన్సులు అందాయి. అంటే రూ.6.76 లక్షల కోట్ల పై చిలుకే! దేశ జీడీపీలో ఇది ఏకంగా 3.1 శాతం! ఇంతటి కీలకమైన ఈ రెమిటెన్సుల్లో అమెరికా తర్వాత సౌదీ అరేబియా, యూఏఈ, కువైట్, ఖతార్, ఒమన్ దేశాల నుంచే అత్యధికంగా వస్తున్నాయి. దాంతో రెమిటెన్సుల్లో భారత్ ప్రపంచంలో అగ్ర స్థానంలో ఉంది.
- కీలక గల్ఫ్ దేశాలతో కూడిన గల్ఫ్ కో ఆపరేటివ్ కౌన్సిల్(జీసీసీ)తో 2020–21లో భారత్ 87 మిలియన్ డాలర్ల మేరకు వాణిజ్యం జరిపింది. మన వర్తక భాగస్వాముల్లో యూఈఏ మూడో, సౌదీ నాలుగో స్థానంలో ఉన్నాయి. యూఏఈతో ఇటీవలే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందమూ కుదిరింది. గల్ఫ్ దేశాలతో బంధాలను మరింత పటిష్టం చేసుకునేందుకు ప్రధాని మోదీ పలుమార్లు పర్యటించారు. ఆర్టికల్ 370 రద్దును స్వాగతించిన తొలి దేశాల్లో యూఏఈ ఉంది.
- ఇరాక్, సౌదీ, యూఏఈ తదితర గల్ఫ్ దేశాల నుంచి మనం భారీగా చమురు దిగుమతి చేసుకుంటున్నాం. యుద్ధం వల్ల రష్యా నుంచి చమురు సరఫరా తగ్గుతున్నందున గల్ఫ్ దేశాలపై ఆధారపడటం మరింతగా పెరిగేలా కన్పిస్తోంది. మనతో వర్తకం ద్వారా సమకూరే ఆదాయం గల్ఫ్ దేశాలకూ కీలకమే. పైగా వాటి కార్మిక శక్తిలో భారతీయులు కీలకంగా ఉన్నారు.
- వీటికి తోడు చాలా గల్ఫ్ దేశాల ఆహార అవసరాలను భారతే తీరుస్తోంది. ఈ జాబితాలో బియ్యం, మాంసం, సుగంధద్రవ్యాలు, పళ్లు, కూరగాయలు, చక్కెర వంటివెన్నో ఉన్నాయి. కువైట్ ఏకంగా 90 శాతం ఆహార పదార్థాలను భారత్ నుంచే దిగుమతి చేసుకుంటోంది!
- చదవండి: Quiz of The Day(June 04, 2022) >> హార్న్‌బిల్ పండుగను జరుపుకునే రాష్ట్రం ?
Mamata Banerjee as Chancellor for Universities in West Bengal : పశ్చిమబెంగాల్‌లో యూనివర్సిటీలకు చాన్స్‌లర్ గా మమతా బెనర్జీ
పశ్చిమబెంగాల్‌లో యూనివర్సిటీలకు ఇకపై గవర్నర్ బదులుగా ముఖ్యమంత్రే చాన్స్‌లర్‌గా వ్యవహరిస్తారు. జూన్ 6 (సోమవారం) సీఎం మమతా బెనర్జీ సారథ్యంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. అసెంబ్లీ వర్షాకాల సమావేశాల్లో ఈ మేరకు బిల్లు పెట్టనుంది. ప్రైవేట్ వర్సిటీల విజిటర్ హోదాను కూడా గవర్నర్ నుంచి రాష్ట్ర విద్యా మంత్రికి బదలాయించారు. గవర్నర్ ధనకర్‌తో మమతకు పొసగని విషయం తెలిసిందే.
Our currency is crucial in world trade..Prime Minister Modi: ప్రపంచ వాణిజ్యంలో కీలకంగా మన కరెన్సీ ..ప్రధాని మోదీ
జన్ సమర్థ్ పోర్టల్ ఆవిష్కరణ–ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‘ ప్రత్యేక నాణేలను ఆవిష్కరిస్తున్న ప్రధాని మోదీ
- అంతర్జాతీయ వాణిజ్యం, సరఫరా వ్యవస్థలో భారతీయ బ్యాంకులను, కరెన్సీని కీలక భాగంగా చేయాల్సిన అవసరం ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అభిప్రాయపడ్డారు. ఆర్థిక, కార్పొరేట్ గవర్నెన్స్ విధానాలను ఎప్పటికప్పుడు మెరుగుపర్చుకోవడంపై ఆర్థిక సంస్థలు మరింతగా దృష్టి పెట్టాలని సూచించారు. ‘మన దేశీ బ్యాంకులు, కరెన్సీని అంతర్జాతీయ సరఫరా వ్యవస్థ, వాణిజ్యంలో కీలక పాత్ర పోషించేలా ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది‘ అని మోదీ పేర్కొన్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్‌లో భాగంగా ఆర్థిక, కార్పొరేట్ వ్యవహారాల శాఖల నిర్వహణలో వారోత్సవాలను ప్రారంభించిన సందర్భంగా ప్రధాని ఈ విషయాలు వివరించారు.
- ఇదే సందర్భంగా ’జన్ సమర్థ్’ పోర్టల్‌ను కూడా ప్రధాని ప్రారంభించారు. 13 రకాల ప్రభుత్వ రుణాల స్కీములకు సంబంధించిన పోర్టల్‌గా ఇది పని చేస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. ‘విద్యార్థులు, రైతులు, వ్యాపారస్తులు, చిన్న తరహా పరిశ్రమల వ్యాపారవేత్తలకు రుణ లభ్యతను మెరుగుపర్చేందుకు జన్ సమర్థ్ తోడ్పడుతుంది. వారి జీవితాలను మెరుగుపర్చడంతో పాటు తమ లక్ష్యాలను సాధించుకోవడంలో తోడ్పడగలదు‘ అని మోదీ పేర్కొన్నారు. అందరికీ ఆర్థిక సర్వీసులను అందించేందుకు అనువైన అనేక ప్లాట్‌ఫామ్‌లను భారత్ అభివృద్ధి చేసిందని, వాటిని పూర్తి స్థాయిలో వినియోగించుకోవడంపై మరింత అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.
ప్రత్యేక నాణేల సిరీస్ ఆవిష్కరణ..
- ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలను పురస్కరించుకుని ప్రత్యేక సిరీస్ నాణేలను ప్రధాని ఆవిష్కరించారు. రూ. 1, రూ. 2, 5, 10, రూ. 20 డినామినేషన్లలో ఇవి ఉంటాయి. వీటిపై ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ (ఏకేఏఎం) డిజైన్ ఉంటుంది. ఇవి స్మారక కాయిన్లు కాదని, యథాప్రకారం చెలామణీలో ఉంటాయని ప్రధాని తెలిపారు. అమృత ఘడియల లక్ష్యాన్ని సాధించాలన్న సంకల్పం గురించి ప్రజలకు నిరంతరం గుర్తు చేసేలా, దేశ అభివృద్ధి కోసం పని చేసేలా ప్రోత్సహించేందుకు కొత్త సిరీస్ నాణేలు తోడ్పడగలవని ఆయన పేర్కొన్నారు.
Wales team qualifies for Football World Cup: ఫుట్‌బాల్ ప్రపంచకప్‌కు వేల్స్ జట్టు అర్హత
- కార్డిఫ్: ఎప్పుడో 1958లో... వేల్స్ ఫుట్‌బాల్ జట్టు ప్రపంచకప్‌లో చక్కటి ప్రదర్శనతో క్వార్టర్ ఫైనల్ వరకు చేరింది. అయితే ఆ మ్యాచ్‌లో అప్పుడు 17 ఏళ్ల వయసు ఉన్న ఆల్‌టైమ్ గ్రేట్ పీలే (బ్రెజిల్) చేసిన ఏకైక గోల్‌తో వేల్స్ పరాజయం పాలైంది. ఆ తర్వాత మరో 15 ప్రపంచకప్‌లు జరిగినా... ఒక్కసారి కూడా వేల్స్ అర్హత సాధించలేకపోయింది. ఇప్పుడు మరోసారి ఆ టీమ్‌కు విశ్వవేదికపై తలపడే అవకాశం వచ్చింది. ఈ ఏడాది ఖతర్‌లో జరిగే ‘ఫిఫా’ వరల్డ్ కప్‌కు వేల్స్ అర్హత పొందింది. క్వాలిఫయర్స్ పోరులో వేల్స్ 1–0 తేడాతో ఉక్రెయిన్‌పై విజయం సాధించింది.
- ఉక్రెయిన్ ఆటగాడు ఆండ్రీ యర్మొలెంకో 34వ నిమిషంలో చేసిన ‘సెల్ఫ్ గోల్’తో వేల్స్‌కు అదృష్టం కలిసొచ్చింది. వేల్స్ స్టార్ ఆటగాడు, ఐదుసార్లు చాంపియన్స్ లీగ్ టైటిల్ విజయాల్లో భాగమైన గారెత్ బేల్ ఈ విజయాన్ని ‘తమ ఫుట్‌బాల్ చరిత్రలో అత్యుత్తమ ఫలితం’గా అభివర్ణించాడు. బేల్ కొట్టిన ఫ్రీకిక్‌ను హెడర్‌తో దిశ మళ్లించే ప్రయత్నంలోనే విఫలమై యర్మొలెంకో బంతిని తమ గోల్‌పోస్ట్‌లోకే పంపించాడు. ప్రపంచకప్‌లో ఇంగ్లండ్, అమెరికా, ఇరాన్ ఉన్న గ్రూప్ ‘బి’లో వేల్స్ పోటీ పడనుంది.
- Download Current Affairs PDFs Here
Argentine football giant Lionel Messi has scored the most goals: అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయెనల్ మెస్సీ అత్యధిక గోల్స్
- అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లయెనల్ మెస్సీ ‘వన్‌మ్యాన్ షో’తో ప్రత్యర్థి జట్టును ఠారెత్తించాడు. ఎస్తోనియాతో జరిగిన మ్యాచ్‌లో అర్జెంటీనా 5–0తో ఘనవిజయం సాధించగా... ఈ ఐదు గోల్స్‌ను మెస్సీ (8వ, 45వ, 47వ, 71వ, 76వ నిమిషాల్లో) ఒక్కడే చేయడం విశేషం. గతంలో దేశం తరఫున ఆడుతూ మెస్సీ ఒకే మ్యాచ్‌లో 5 గోల్స్ చేయలేదు.
- ఈ క్రమంలో జాతీయ జట్ల తరఫున అత్యధిక గోల్స్ (86) చేసిన క్రీడాకారుల జాబితాలో మెస్సీ నాలుగో స్థానానికి ఎగబాకాడు. తొలి మూడు స్థానాల్లో వరుసగా క్రిస్టియానో రొనాల్డో (117 గోల్స్–పోర్చుగల్), అలీ దాయ్ (109 గోల్స్–ఇరాన్), ముఖ్తార్ దహరి (89 గోల్స్–మలేసియా) ఉన్నారు.