Skip to main content

Daily Current Affairs in Telugu: 2022, జూన్‌ 21th కరెంట్‌ అఫైర్స్‌

Current Affairs in Telugu June 21th 2022(డైలీ కరెంట్‌ అఫైర్స్‌ తెలుగులో): Current Affairs for All Competitive Exams In Telugu. Latest Articles useful for TSPSC &APPSC Group-1,2,3, 4, SSC, Bank, SI, Constable and all other competitive examinations
Daily Current Affairs in Telugu

82-year-old woman runs 78 miles in 24 Hours: 82ఏళ్లు.. 24గంటలు.. 125కిలోమీటర్లు

 • ఇవేం లెక్కలబ్బా... అని బుర్ర బద్దలు కొట్టుకుంటున్నారా? బార్బరా హంబర్ట్‌ అనే ఫ్రాన్స్‌ మహిళ రికార్డులివి. గత నెలాఖరులో జరిగిన ఫ్రెంచ్‌ చాంపియన్‌షిప్‌లో 24 గంటల్లో 125 కిలోమీటర్లు పరుగెత్తి ప్రపంచరికార్డు సృష్టించింది 82 ఏళ్ల బార్బరా. 24 గంటల్లో 105 కిలోమీటర్లు పరుగెత్తి ఓ జర్మన్‌ మహిళ నెలకొల్పిన రికార్డును బార్బరా బ్రేక్‌ చేసింది. ఆ వయసులో అలా పరుగెత్తిందంటే ఆమె జీవితమంతా రన్నింగేనేమో అనుకోకండి.
 • తనకు 43 ఏళ్ల వయసులో అంటే తన కూతురు హైస్కూల్‌ గ్రాడ్యుయేషన్‌ ఎగ్జామ్‌ టైమ్‌లో రన్నింగ్‌ మొదలుపెట్టారామె. మొదట బౌఫ్‌మాట్‌వీధులకే పరిమితమైన బార్బరా పరుగు... తరువాత మారథాన్స్‌ దాకా వెళ్లింది. ఈ 39 ఏళ్ల కాలంలో  పారిస్, న్యూయార్కుల్లో జరిగిన 137 రేసులు, 54 మారథాన్స్‌లో పాల్గొన్నది. ‘మొదట మెడిటేషన్‌లాగా మొదలుపెట్టాను. కానీ వీధుల్లో పరుగెడుతున్నప్పుడు కలిగిన స్వేచ్ఛా భావన నాకో స్పష్టతనిచ్చింది. అప్పటినుంచి పరుగును ఆపలేదు’ అంటుంది బార్బరా.
 • అంతేకాదు.. పరుగు పూర్తయ్యేవరకు దాహం, ఆకలి, నిద్ర అన్నింటినీ మరిచిపోతుంది. ముగింపు లైన్‌ దాటాకే ఆమెకు అలసట గుర్తొస్తుంది. 14 గంటల రేసులో ఆమెతోపాటు ఉండి... అవసరమైనవల్లా అందించిన ‘మై హస్బెండ్‌ ఈజ్‌ సీక్రెట్‌ ఆఫ్‌ మై ఎనర్జీ’ అంటారు బార్బరా. ఆ వయసులో పరుగు మొదలుపెడితే అడ్డంకులేం ఎదురు కాలేదా? అంటే... చాలా గాయాలయ్యాయి. నొప్పులొచ్చాయి. అయినా ఇవేవీ ఆమె పరుగును ఆపలేకపోయాయి. ఎలాంటి మందులు వేసుకోను, కేవలం ట్రైనింగ్‌నే నమ్ముతానని చెప్పే బార్బరా.. రన్నింగ్‌ను వదిలేస్తే మాత్రం నిరుత్సాహం ఆవహిస్తుందంటారు.   
 • Download Current Affairs PDFs: Click Here
 • యాప్‌ డౌన్‌లోడ్‌ ఇలా..
  డౌన్‌లోడ్‌ వయా గూగుల్‌ ప్లేస్టోర్‌

Russian Journalist Sells Nobel Prize: ఉక్రెయిన్‌ చిన్నారుల కోసం.. నోబెల్‌ బహుమతిని వేలానికి పెట్టిన రష్యాన్‌ జర్నలిస్ట్

 • ఉక్రెయిన్‌లో యుద్ధం కారణంగా నిరాశ్రయులైన చిన్నారుల సహాయార్థం రష్యాన్‌ జర్నలిస్ట్‌ డిమిత్రి మురాటోవ్ తనకు లభించిన నోబెల్‌ బహుమతిని విక్రయించారు. ఆయన 1999లో స్థాపించబడిన నోవాయా వార్తాపత్రిక సంపాదకుడు. ఈ మేరకు డిమిత్రి మురాటోవ్‌ తన నోబెల్‌ శాంతి బహుమతిని ప్రపంచ శరణార్థుల దినోత్సవం రోజున వేలం నిర్వహించారు. ఐతే ఊహించని రీతిలో మురాటోవో నోబెల్‌ బహుమతి మరే ఏ ఇతర నోబెల్‌ బహుమతులు సాధించిన విధంగా వేలంలో రికార్డు స్థాయిలో అత్యధిక ధర పలికింది.
 • హెరిటేజ్‌ వేలం కంపెనీ ఈ నోబెల్‌ ప్రైజ్‌ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని నిరాశ్రయులైన పిల్లల కోసం కృషి చేస్తున్న యూనిసెఫ్‌ అందజేస్తామని స్పష్టం చేసింది. ఐతే మురాటోవ్‌ 2021లో ఫిలిఫ్పీన్స్‌కు చెందిన మరియా రెస్సాతో కలసి ఈ నోబెల్‌ బహుమతిని గెలుచుకున్నారు. రష్యా అధ్యక్షుడి పుతిన్‌ 1999 నుంచి మీడియా సంస్థలపై ఉక్కుపాదం మోపి కట్టడి చేస్తూ వస్తున్నాడు. ఎప్పుడైతే రష్యా అధ్యక్షుడు వ్లాదిమర్‌ పుతిన్‌ ఉక్రెయిన్‌పై దురాక్రమణ యుద్ధానికి దిగాడో అప్పటి నుంచి రష్యాలోని మీడియా సంస్థలపై మరింత ఒత్తిడి పెంచాడు. ఈ క్రమంలో మురాటోవో గెజిటా వార్తాపత్రిక ఉక్రెయిన్‌లో యుద్ధం విషయమై రష్యా దుశ్చర్యను ఎండగడుతూ రాసింది.
 • అంతే పుతిన్‌ ప్రభుత్వం వరుస హెచ్చరికలను జారీ చేసి తదనంతరం పూర్తిగా ఆ పత్రిక కార్యకలాపాలను నిలిపేసింది. అంతేకాదు మురాటోవా పై ఎరుపురంగుతో దాడి చేశారు. కానీ మాస్కో మాత్రం ఈ యుద్ధాన్ని భద్రతా దృష్ట్యా సాగిస్తున్న ప్రత్యేక సైనిక చర్యగా చెప్పుకుంటూ రష్యా ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించింది. ఐతే పాశ్చాత్య దేశాలు దీన్ని దురాక్రమణ యుద్ధంగా గొంతెత్తి చెప్పాయి. ఈ మేరకు మురాటోవో మాట్లాడుతూ...తన సిబ్బంది మద్దతుతో ఈ వేలం నిర్వహించినట్ల తెలిపారు. ఈ వేలం ద్వారా వచ్చిన మొత్తం ఉక్రెయిన్‌ శరణార్థుల జీవితాలకు ప్రయోజనకరంగా ఉండాలని ఆశిస్తున్నానని చెప్పారు. 

GK International Quiz: ఏకకాలంలో 78,220 జాతీయ జెండాలను రెపరెపలాడించి కొత్త గిన్నిస్ ప్రపంచ రికార్డు సృష్టించిన దేశం?

Bora Your fish is the largest in the world !! : బోరామీ చేప ప్రపంచంలో అతిపెద్దది!!

Bora Your fish is the largest in the world

 • ప్రపంచంలోనే అతిపె..ద్ద మంచి నీటి చేపను గుర్తించారు పరిశోధకులు. ఇప్పటిదాకా వెలుగులోకి వచ్చిన పెద్ద చేపలతో పోల్చుకుని.. దీనిని నిర్ధారించారు. సుమారు 13 అడుగుల పొడవు, దాదాపు 300 కేజీల బరువు ఉంది అది. 
 • కంబోడియా మెకాంగ్‌ నదిలో ఈ భారీ చేపను గుర్తించారు. పదలు సంఖ్యలో జాలర్లు దీనిని ఒడ్డుకు లాక్కొరు. ఖేమర్‌ భాషలో క్రిస్టెన్డ్‌ బోరామీ(పూర్తి చంద్రుడు) అని పిలవబడే ఈ చేపకు.. దాని ఆకారం వల్లే ఆ పేరు వచ్చింది. అయితే దొరికిన ఈ భారీ చేపను పరిశీలించిన పరిశోధకులు.. జాలర్లను ఒప్పించి ఎలక్ట్రానిక్‌ ట్యాగ్‌తో తిరిగి నీళ్లలోకి వదిలేశారు. ఇక నుంచి దాని కదలికలను పరిశీలించనున్నారు.
 • నేషనల్‌ జియోగ్రాఫిక్‌ చానెల్‌లో ‘మాంస్టర్‌ ఫిష్‌’ షో నిర్వాహకుడు జెబ్‌ హోగన్‌.. దీనిని అధికారికంగా ప్రపంచంలోనే అతిపెద్ద మంచి నీటి చేపగా గుర్తించారు. ఇంతకుముందు 2005లో థాయ్‌లాండ్‌లో 293 కేజీల బరువున్న ఓ క్యాష్‌ పిష్‌ను పరిశోధకులు గుర్తించారు. 
 • మెకాంగ్‌ నది ప్రపంచంలోనే చేపల ఆవాసం ఎక్కువగా ఉండే మూడో నది. మితిమీరి చేపలు పట్టడం, కాలుష్యం, ఉప్పునీటి చొరబాటు, అవక్షేపాల క్షీణత కారణంగా చేపల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది.

Neeraj Chopra: స్వర్ణం నెగ్గిన నీరజ్‌ చోప్రా

Neeraj Chopra

భారత స్టార్‌ జావెలిన్‌ త్రోయర్‌ నీరజ్‌ చోప్రా ఈ ఏడాది తొలి స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఫిన్‌లాండ్‌లో జూన్‌  18(శనివారం) జరిగిన కూర్తానె గేమ్స్‌లో నీరజ్‌ జావెలిన్‌ను 86.69 మీటర్ల దూరం విసిరి విజేతగా నిలిచాడు. కెషర్న్‌ వాల్కట్‌ (ట్రినిడాడ్‌ అండ్‌ టొబాగో; 86.64 మీటర్లు) రజతం, అండర్సన్‌ పీటర్స్‌ (గ్రెనెడా; 84.75 మీటర్లు) కాంస్యం సాధించారు. గత ఏడాది టోక్యో ఒలింపిక్స్‌లో స్వర్ణం గెలిచిన నీరజ్‌ పది నెలల తర్వాత ఇటీవల పావో నుర్మీ గేమ్స్‌లో పాల్గొని రజతం సాధించాడు. 

కరెంట్ అఫైర్స్ (ముఖ్యమైన తేదీలు) ప్రాక్టీస్ టెస్ట్ (30-06 May, 2022)

Published date : 21 Jun 2022 06:31PM

Photo Stories