Skip to main content

థల్ సేనా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన

భారత సైన్యం కోసం దేశ రాజధాని న్యూఢిల్లీలో నూతన ప్రధాన కార్యలయం నిర్మించనున్నారు.
Current Affairs‘థల్ సేనా భవన్’ పేరుతో నిర్మించే ఈ భవనానికి రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఫిబ్రవరి 21న శంకుస్థాపన చేశారు. రూ.700 కోట్లతో ఉదయించే సూర్యుడి ఆకృతిలో ఈ భవనాన్ని నిర్మించనున్నారు. కొత్త భవనం 3-4 ఏళ్లలో సిద్ధమవుతుందని భారత సైన్యాధిపతి జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె పేర్కొన్నారు. ఏడంతస్తుల ఈ భవనంలో సైన్యానికి చెందిన 2900 మంది, పౌర సిబ్బంది 3100 మంది పనిచేస్తారని ఉన్నతాధికారులు తెలిపారు. 250 మంది భద్రతా సిబ్బంది ఈ ప్రాంగణంలోనే బస చేస్తారని వివరించారు. 4వేల కార్ల పార్కింగ్‌కు ఏర్పాట్లు ఉంటాయన్నారు. ప్రస్తుతం సైనిక ప్రధాన కార్యాలయం సౌత్ బ్లాక్ భవనంలో ఉంది.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
థల్ సేనా భవన్ నిర్మాణానికి శంకుస్థాపన
ఎప్పుడు : ఫిబ్రవరి 21
ఎవరు : రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 22 Feb 2020 05:46PM

Photo Stories