ఠాగూర్ అవార్డుల ప్రదానోత్సవం
Sakshi Education
‘ఠాగూర్ అవార్డ్ ఫర్ కల్చరల్ హార్మొనీ’ పేరిట ఇచ్చే అవార్డుల ప్రదానోత్సవం న్యూఢిల్లీలో ఫిబ్రవరి 18నజరిగింది.
ఠాగూర్ అవార్డులకు ఎంపికైన వారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అవార్డులను ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ కూడా పాల్గొన్నారు. 2014, 2015, 2016 సంవత్సరాలకుగానూ ఠాగూర్ అవార్డులకు వరుసగా ప్రముఖ మణిపురీ డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ రాజ్‌కుమార్ సింఘజిత్ సింగ్, బంగ్లాదేశ్ కల్చరల్ ఆర్గనైజేషన్ ఛాయనౌత్, ప్రముఖ శిల్పి రామ్ వాన్జీ సుతార్‌లు ఎంపికయ్యారు. ఠాగూర్ అవార్డులకు అర్హులైన వారిని ప్రధాని మోదీ నేతృత్వంలోని కమిటీ ఎంపిక చేసింది. ఈ అవార్డు కింద కోటి రూపాయల నగదును బహుమతిగా అందిస్తారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఠాగూర్ అవార్డుల ప్రదానోత్సవం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఠాగూర్ అవార్డుల ప్రదానోత్సవం
ఎప్పుడు : ఫిబ్రవరి 18
ఎవరు : రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్
ఎక్కడ : న్యూఢిల్లీ
Published date : 19 Feb 2019 05:45PM