Skip to main content

Telangana High Court: హైకోర్టు తాత్కాలిక సీజేగా నియమితులైన న్యాయమూర్తి?

తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా జస్టిస్‌ మామిడన్న సత్యరత్న రామచందర్‌రావు నియమితులయ్యారు.
ఈ మేరకు కేంద్ర ప్రభుత్వ అదనపు కార్యదర్శి రాజిందర్‌ కష్యప్‌ ఆగస్టు 27న ఉత్తర్వులు జారీచేశారు. 1966, ఆగస్టు 7న హైదరాబాద్‌లో జన్మించిన జస్టిస్‌ ఎంఎస్‌ రామచందర్‌రావు ఉస్మానియా వర్సిటీలో ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. 1989లో న్యాయవాదిగా ఎన్‌రోల్‌ చేసుకున్నారు. లండన్‌లోని కేంబ్రిడ్జి వర్సిటీలో 1991లో ఎల్‌ఎల్‌ఎం పూర్తి చేశారు. అనంతరం ఎస్‌బీఐ, డీసీసీ బ్యాంక్, సెబీతోపాటు పలు కంపెనీలు, ఫైనాన్షియల్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ తరఫున వాదనలు వినిపించారు. ఏపీ ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాదిగా సేవలు అందించారు.

2013లో పూర్తిస్థాయి న్యాయమూర్తిగా...
సివిల్, ఆర్బిట్రేషన్, కంపెనీలా, అడ్మినిస్ట్రేటివ్, కాన్సిస్ట్యూషనల్‌ లా, లేబర్, సర్వీస్‌ లాకు సంబంధించిన కేసులను వాదించడంలో పేరొందిన జస్టిస్‌ రామచందర్‌రావు.. 2012, జూన్‌ 29న ఉమ్మడి హైకోర్టు అదనపు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. 2013, డిసెంబర్‌ 4న పూర్తిస్థాయి న్యాయమూర్తిగా నియమితులయ్యారు. జస్టిస్‌ రామచందర్‌రావు తండ్రి జస్టిస్‌ ఎం.జగన్నాథరావు సుప్రీంకోర్టు న్యాయమూర్తి (1997–2000)గా పదవీ విరమణ చేశారు. అలాగే వీరి తాతయ్య జస్టిస్‌ రామచందర్‌రావు 1960–61లో హైకోర్టు జడ్జిగా సేవలు అందించారు.

క్విక్‌ రివ్యూ :

ఏమిటి : తెలంగాణ రాష్ట్ర హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (సీజే)గా నియమితులైన న్యాయమూర్తి?
ఎప్పుడు : ఆగస్టు 27
ఎవరు : జస్టిస్‌ మామిడన్న సత్యరత్న రామచందర్‌రావు
ఎందుకు : రాష్ట్ర హైకోర్టు ప్రస్తుత సీజే
Published date : 28 Aug 2021 06:06PM

Photo Stories