టోర్నీ చాంపియన్‌గా అవతరించిన జట్టు?
Sakshi Education
అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ (ఏటీపీ) కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్‌లో రష్యా జట్టు తొలిసారి చాంపియన్‌గా అవతరించింది.
ఇటలీ జట్టుతో ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో ఫిబ్రవరి 7న జరిగిన ఫైనల్లో రష్యా 2-0తో విజయం సాధించింది. ఫలితం తేలిపోవడంతో మూడో మ్యాచ్‌గా జరగాల్సిన డబుల్స్ మ్యాచ్‌ను నిర్వహించలేదు.
మాజీ బాక్సర్ లియోన్ స్పింక్స్ కన్నుమూత
అమెరికా ప్రొఫెషనల్ బాక్సర్, 1976 మాంట్రియల్ ఒలింపిక్స్ స్వర్ణ పతక విజేత లియోన్ స్పింక్స్(67) కన్నుమూశాడు. క్యాన్సర్ కారణంగా అమెరికాలోని నెవాడా రాష్ట్రంలోని హెండర్‌సన్‌లో ఫిబ్రవరి 5న తుదిశ్వాస విడిచారు. లియోన్ స్పింక్స్... 1976 మాంట్రియల్ ఒలింపిక్స్‌లో పురుషుల లైట్ హెవీవెయిట్ విభాగంలో పసిడి పతకాన్ని కైవసం చేసుకున్నాడు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : ఏటీపీ కప్ పురుషుల టీమ్ టోర్నమెంట్‌లో చాంపియన్
ఎప్పుడు : ఫిబ్రవరి 7
ఎవరు : రష్యా జట్టు
Published date : 09 Feb 2021 06:08PM