టోక్యో ఒలింపిక్స్‌లో పాల్గొనబోవడం లేదని ప్రకటించిన దేశం?
Sakshi Education
2021 జూలై, ఆగస్టు నెలల్లో జపాన్ రాజధాని టోక్యోలో జరగాల్సిన ఒలింపిక్స్ క్రీడల్లో తమ దేశం పాల్గొనబోవడం లేదని ఉత్తర కొరియా క్రీడా మంత్రిత్వ శాఖ ఏప్రిల్ 6న ప్రకటించింది.
ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వాస్తవానికి టోక్యో ఒలింపిక్స్ 2020 జూలై, ఆగస్టులలో జరగాల్సింది. అయితే కరోనా వైరస్‌తో ఈ మెగా క్రీడలను 2021 జూలై, ఆగస్టుకు వాయిదా వేశారు.
మ్యూనిక్ ఒలింపిక్స్‌లో...
1972 మ్యూనిక్ ఒలింపిక్స్‌లో అరంగేట్రం చేసిన ఉత్తర కొరియా ఆ తర్వాత రెండు ఒలింపిక్స్ క్రీడల్లో పాల్గొంది. అనంతరం రాజకీయ కారణాలతో 1984 లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్, 1988 సియోల్ ఒలింపిక్స్ క్రీడలను ఉత్తర కొరియా బహిష్కరించింది. 1992 బార్సిలోనా ఒలింపిక్స్‌లో పునరాగమనం చేశాక 2016 రియో ఒలింపిక్స్ వరకు ఉత్తర కొరియా బరిలోకి దిగింది.
ఉత్తర కొరియా...
రాజధాని: ప్యాంగ్ యాంగ్; కరెన్సీ: నార్త్ కొరియన్ వన్
ఉత్తర కొరియా ప్రస్తుత అధ్యక్షుడు: కిమ్ జోంగ్ ఉన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : టోక్యో ఒలింపిక్స్–2021లో పాల్గొనబోవడం లేదని ప్రకటించిన దేశం?
ఎప్పుడు : ఏప్రిల్ 6
ఎవరు : ఉత్తర కొరియా
ఎక్కడ : టోక్యో, ఒలింపిక్స్
ఎందుకు : ప్రాణాంతక కరోనా వైరస్ నుంచి తమ దేశ క్రీడాకారులను కాపాడేందుకు

Published date : 07 Apr 2021 06:32PM