టోక్యో ఒలింపిక్స్‌కు ఐదుగురు భారత బాక్సర్లు
Sakshi Education
2020 టోక్యో ఒలింపిక్స్‌కు ఐదుగురు భారత బాక్సర్లు వికాస్ కృషన్ (69 కేజీలు), ఆశిష్ కుమార్ (75 కేజీలు), సతీశ్ కుమార్ యాదవ్ (ప్లస్ 91 కేజీలు), పూజా రాణి (75 కేజీలు), లవ్లీనా బొర్గోహైన్ (69 కేజీలు) అర్హత సాధించారు.
జోర్డాన్ రాజధాని అమ్మాన్‌లో జరుగుతున్న ఆసియా క్వాలిఫయింగ్ టోర్నీలో పురుషుల విభాగంలో వికాస్, ఆశిష్, సతీశ్... మహిళల విభాగంలో పూజా రాణి, లవ్లీనా సెమీఫైనల్ చేరుకొని ‘టోక్యో’ బెర్త్‌లను ఖాయం చేసుకున్నారు. విజేందర్ తర్వాత భారత్ తరఫున మూడోసారి ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన రెండో బాక్సర్‌గా వికాస్ కృషన్ గుర్తింపు పొందగా... ఆశిష్, సతీశ్, పూజా రాణి, లవ్లీనా తొలిసారి ఒలింపిక్స్ బరిలో నిలువనున్నారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : వికాస్ కృషన్, ఆశిష్ కుమార్, సతీశ్ కుమార్ యాదవ్, పూజా రాణి, లవ్లీనా బొర్గోహైన్
క్విక్ రివ్యూ :
ఏమిటి : 2020 టోక్యో ఒలింపిక్స్‌కు అర్హత
ఎప్పుడు : మార్చి 8
ఎవరు : వికాస్ కృషన్, ఆశిష్ కుమార్, సతీశ్ కుమార్ యాదవ్, పూజా రాణి, లవ్లీనా బొర్గోహైన్
Published date : 10 Mar 2020 07:01PM