తొలిసారిగా విడుదలైన రూ. 20 నాణేలు ఏ రంగ ప్రాధాన్యతను తెలియజేస్తాయి?
Sakshi Education
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ) 2020, మార్చి7న విడుదల చేసిన కొత్త 20 రూపాయల నాణేలు మార్కెట్లో చలామణిలోకి వచ్చాయి.
ప్రస్తుతం ఉన్న రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 నాణేలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.20 నాణేలను అందుబాటులోకి తెచ్చింది. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ 20 రూపాయల నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయ రంగానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్ని రూపొందించారు. రూ.20 నాణెం బరువు సుమారు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. అంధులు కూడా సులువుగా గుర్తించగలిగే రీతిలో వీటిని రూపొందించారు.
ఆర్‌బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి కన్నుమూత
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి(68) మార్చి 26న గుండెపోటుతో ముంబైలోని తన స్వగృహంలో మరణించారు. చక్రవర్తి 2009–14 మధ్య ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మార్కెట్‌లోకి తొలిసారిగా రూ. 20 నాణేలు విడుదల
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ)
ఎక్కడ : దేశ వ్యాప్తంగాఆర్బీఐ మాజీ డిప్యూటీ గవర్నర్ చక్రవర్తి కన్నుమూత
రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ) మాజీ డిప్యూటీ గవర్నర్ కేసీ చక్రవర్తి(68) మార్చి 26న గుండెపోటుతో ముంబైలోని తన స్వగృహంలో మరణించారు. చక్రవర్తి 2009–14 మధ్య ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా బాధ్యతలు స్వీకరించారు. పదవీకాలం ముగియడానికి మూడు నెలల ముందే రాజీనామా చేశారు.
క్విక్ రివ్యూ :
ఏమిటి : మార్కెట్‌లోకి తొలిసారిగా రూ. 20 నాణేలు విడుదల
ఎప్పుడు : మార్చి 30
ఎవరు : రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్బీఐ)
Published date : 31 Mar 2021 06:05PM