Skip to main content

తొలిసారిగా రూ. 20 నాణేలు ఆవిష్కరణ

ప్రస్తుతం ఉన్న నాణేలకు అదనంగా కేంద్ర ప్రభుత్వం తొలిసారిగా రూ.20 నాణేలనుఅందుబాటులోకి తెచ్చింది.
ఢిల్లీలో మార్చి7న జరిగిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ రూ. 20 నాణేన్ని ఆవిష్కరించారు. 12 కోణాల బహుభుజ ఆకృతిలో ఉండే ఈ నాణెంపై.. ధాన్యపుగింజలు ముద్రించి ఉంటాయి. దేశీయంగా వ్యవసాయానికి ఉన్న ప్రాధాన్యాన్ని తెలియజేసేలా దీన్నిరూపొందించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ తెలిపారు. దీనితో పాటు రూ. 1, రూ. 2, రూ. 5, రూ. 10 నాణేల్లో కూడా కొత్త సిరీస్‌ను ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. అంధులు కూడా సులువుగా గుర్తించగలిగే రీతిలో వీటిని రూపొందించారు.

రూ.20 నాణెం బరువు సుమారు 8.54 గ్రాములు, వ్యాసం 27 మిల్లీమీటర్లుగా ఉంటుంది. పాత, కొత్త నాణేలకు మధ్య వ్యత్యాసాన్ని సులభంగా గుర్తించేలా ఈ కాయిన్స్ ముద్రణ ఉంటుందని కేంద్ర ఆర్థిక వ్యవహారాల విభాగం కార్యదర్శి సుభాష్ చంద్ర గర్గ్ తెలిపారు.

క్విక్ రివ్యూ :
ఏమిటి :
రూ. 20 నాణేలు ఆవిష్కరణ
ఎప్పుడు : మార్చి 7
ఎవరు : ప్రధాని నరేంద్ర మోదీ
ఎక్కడ : ఢిల్లీ
Published date : 08 Mar 2019 04:36PM

Photo Stories